అందాల పోటీలే కాదు.. అగ్నిప్రమాదాలపైనా ఫోకస్ పెట్టాలి

TG Politics: Both of them breastfed and breast punched: KTR
TG Politics: Both of them breastfed and breast punched: KTR

పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో KTR మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం అందాల పోటీల మీదే కాదు.. అగ్నిప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అగ్నిప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఈ ఘటన గురించి రాజకీయంగా మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ఇవ్వడం కాదని.. ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బాధిత కుటుంబాలకు రేవంత్ ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.