బీఆర్‌ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. క్రమశిక్షణ కలిగిన కేసీఆర్ కార్యకర్తను నేను.. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా.. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తా, గీత దాటేది లేదు.. అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో ఎలాంటి విబేధాలు లేవన్నారు. కేసీఆర్ మాటే.. హరీష్ బాట.. గీత దాటేది లేదంటూ పేర్కొన్నారు.