సంపూ ఎక్కడ?

sampoornesh babu is not there in our house because big boss show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బర్నింగ్‌స్టార్‌ సంపూర్నేష్‌బాబు ‘బిగ్‌బాస్‌’ షోలో ఎంటర్‌ అయిన వెంటనే షో క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. బిగ్‌బాస్‌ కోసం ఎంపిక అయిన 14 మంది సెలబ్రెటీల్లో సంపూర్నేష్‌బాబు ఎక్కువ క్రేజ్‌ ఉన్న స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అందరిలో కంటే ఎక్కువగా సంపూర్నేష్‌బాబుకు ప్రేక్షకుల మద్దతు ఉంది. కాని సంపూర్నేష్‌బాబు మాత్రం నాలుగు గోడల మద్య ఉండలేను అంటూ వెళ్లి పోయిన విషయం తెల్సిందే. సంపూర్నేష్‌బాబు వెళ్లి పోవడానికి చివరకు ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంపూను ఇంటి నుండి పంపించడం జరిగింది. సంపూ తన ఇష్టపూర్తిగా తప్పుకున్నాడు కనుక పారితోషికం రాకపోవడంతో పాటు, భారీగా నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంది. 

గతంలో హిందీ బిగ్‌బాస్‌ షో నుండి ఇద్దరు పార్టిసిపెంట్స్‌ మద్యలో వెళ్లి పోయిన సందర్బంగా 50 లక్షల రూపాయల జరిమానా వారి నుండి వసూళ్లు చేయడం జరిగింది. ఇప్పుడు సంపూ నుండి కూడా ఆ స్థాయిలో వసూళ్లు చేస్తారా అనే ప్రచారం జరుగుతుంది. సంపూర్నేష్‌బాబు బిగ్‌బాస్‌ ఇంటి నుండి బయటకు వచ్చి దాదాపు వారం అవుతుంది. అయినా ఇంకా కూడా సంపూ ఎక్కడ ఉన్నది తెలియడం లేదు. సంపూర్నేష్‌బాబు ప్రస్తుతం ఆయన ఊర్లో ఉన్నాడని కొందరు అంటున్నారు, మరి కొందరు మాత్రం పుణేలోనే బిగ్‌బాస్‌ నిర్వాహకుల వద్ద ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి నేడు లేదా రేపు అంటే ఎన్టీఆర్‌ వచ్చే ఎపిసోడ్స్‌లో సంపూర్నేష్‌బాబు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనే విషయం తేలే అవకాశం ఉంది

మరిన్ని వార్తలు:

ప్రభాస్‌ కు కథ రెడీ చేసిన జక్కన్న..?

ముమైత్‌ రీఎంట్రీ.. విమర్శలు

దిల్‌రాజుకు మూర్తన్న సలహా