దిల్‌రాజుకు మూర్తన్న సలహా

Narayana Murthy advice to Dil Raju to do Michael Jackson biopic with Allu Arjun

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎర్ర(విప్లవ) సినిమాల హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరున్న ఆర్‌ నారాయణ మూర్తి ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా ముక్కుసూటిగా చేస్తాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. తాజాగా ఈ ఎర్రన్న ‘ఫిదా’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో పాల్గొన్నాడు. దిల్‌రాజు నిర్మాణంలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమాపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ కారణం భారీగా థ్యాంక్స్‌ మీట్‌ పెట్టారు. ఈ సమావేశంలో ఆర్‌ నారాయణ మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

నారాయణమూర్తి మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే దిల్‌రాజు గారు రామానాయుడు, విజయ బాపినీడు, అల్లు అరవింద్‌ స్థాయికి ఎదిగారు అని, ఆయన ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్‌తో దిల్‌రాజు గారు మైకేల్‌ జాక్సన్‌ జీవిత కథ సినిమాను తీయాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌ డాన్స్‌ బాగా చేస్తారు. ఆయన అందుకే మైకేల్‌ జాక్సన్‌ జీవిత చరిత్రకు ఆయన బాగా ఉపయోగపడతాడు అంటూ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. ఈ సినిమాను దిల్‌రాజు గారితో కలిసి అల్లు అరవింద్‌ గారు కూడా కలిసి నిర్మించాలని ఆయన పేర్కొన్నాడు ఆ సయమంలో అల్లు అరవింద్‌ మరియు దిల్‌ రాజులు నవ్వుతూ తూపి ఓకే అన్నట్లుగా సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు

ట్విట్టర్‌లో నాగ్‌, ఎన్టీఆర్‌ల ‘బిగ్‌బాస్‌’ చర్చ

ధనుష్‌ సాహసోపేత నిర్ణయం

ఫిదా సక్సెస్‌ అయినా వరుణ్‌ అసంతృప్తి