ట్విట్టర్‌లో నాగ్‌, ఎన్టీఆర్‌ల ‘బిగ్‌బాస్‌’ చర్చ

Nagarjuna Tweet About Jr NTR Big Boss Show TRP Rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షోకు అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తుంది. ముఖ్యంగా బిగ్‌బాస్‌ షో కారణంగా గత వారం స్టార్‌ మాటీవీ రేటింగ్‌ అమాంతం పెరిగి పోయింది. నెం.1 స్థానంకు స్టార్‌ మా చేరింది. భారీగా టీఆర్పీ రేటింగ్‌ వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఎన్టీఆర్‌ వచ్చే శని, ఆదివారాల్లో భారీ రేటింగ్‌ షోకు వస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ట్విట్టర్‌ ద్వారా ఎన్టీఆర్‌కు శుభాకంక్షలు తెలిపాడు.

బిగ్‌బాస్‌కు భారీ ఓపెనింగ్స్‌ వచ్చినందుకు కంగ్రాట్‌ అంటూ నాగార్జున ట్వీట్‌ చేయగ అందుకు ఎన్టీఆర్‌ కూడా వెంటనే స్పందించాడు. థ్యాంక్స్‌ బాబాయి, మీరు వేసిన అడుగులే మాకు ఆదర్శం అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేయడం అందరిని ఆకర్షించింది. ఎన్టీఆర్‌, నాగార్జునల మద్య ట్వీట్‌ సంభాషణ వారిద్దరి మద్య ఉన్న అన్యోన్యంను చూపుతుంది. ఇక నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేసేందుకు ఒప్పుకున్న తర్వాత తెలుగు స్టార్‌ హీరోలు అంతా కూడా బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెల్సిందే. నాగార్జున బుల్లి తెరపై భారీ రేటింగ్‌ను సంపాదించాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌తో దున్నేస్తున్నాడు.

మరిన్ని వార్తలు:

రాజశేఖర్ కూతురు, నిర్మాత కుమారుడు..!

స్టార్‌ మాను నెం.1 చేసిన బిగ్‌బాస్‌

గుత్తాజ్వాల వార్తల్లో నిజం ఎంత?