రాజశేఖర్ కూతురు, నిర్మాత కుమారుడు..!

Shivani Rajasekhar Debut With Shiva Kandukuri

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినీ పరిశ్రమలో జీవిత రాజశేఖర్‌ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెల్సిందే. పెద్దమ్మాయి శివాని ప్రస్తుతం మెడిసిన్‌ చదువుతుంది. త్వరలోనే మెడిసిన్‌ను పూర్తి చేసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఆమద్య ఒక తమిళ సినిమాలో హీరోయిన్‌గా ఈమె నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె ఒక తెలుగు సినిమాను కూడా చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. 

ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి కుమారుడు శివ కందుకూరితో శివాని రొమాన్స్‌ చేయబోతుంది. రాజ్‌ కందుకూరి స్వయంగా ఆ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం చివర్లో సెట్స్‌ మీదకు తీసుకు వెళ్లి సినిమాను 2019లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆలోపు శివాని తమిళంలో ఒప్పుకున్న సినిమాను కూడా పూర్తి చేయనుంది. ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న శివ త్వరలోనే ఇండియాకు రానున్నాడు. ఆ తర్వాత యాక్టింగ్‌ స్కూల్‌కు వెళ్లనున్నాడు. ఒక యువ దర్శకుడు వీరిద్దరి కోసం ఒక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీని సిద్దం చేస్తున్నాడు. రాజశేఖర్‌ బిడ్డ శివాని ఆ కొత్త హీరోతో ప్రేమలో పడి సక్సెస్‌ అవుతుందా లేదా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు

పైసా వసూల్ స్టంపర్ అదిరిందిగా… వీడియో

స్టార్‌ మాను నెం.1 చేసిన బిగ్‌బాస్‌

క్షమాపణలు చెప్పిన ధనుష్‌