ఫిదా సక్సెస్‌ అయినా వరుణ్‌ అసంతృప్తి

Mega Hero Varun Tej is unsatisfied with Fida Success

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో వరుణ్‌ తేజ్‌కు ఎట్టకేలకు ఒక కమర్షియల్‌ సక్సెస్‌ దక్కింది. పలు చిత్రాలు చేసిన తర్వాత వర్మ ‘ఫిదా’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయగుగుతున్నాడు. ఫిదా చిత్రం ఓవర్సీస్‌లో మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ వసూళ్లను రాబడుతున్నాడు. లాంగ్‌ రన్‌లో ఈ సినిమా 25 నుండి 30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇంత మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్నప్పటికి వరుణ్‌ తేజ్‌ మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన ఈగో కాస్త దెబ్బ తింటుందని, ఆయన తీరును పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు.

గత రెండూ ముడు రోజులుగా ‘ఫిదా’ టీం ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. సినిమాను భారీ సక్సెస్‌ చేసినందకు థ్యాంక్స్‌ చెప్పడంతో పాటు, సినిమాను మరింతగా ప్రమోట్‌ చేసేందుకు మీడియా ముందుకు వస్తున్నారు. ఈ సమయంలోనే వరుణ్‌ తేజ్‌ కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం సాయి పల్లవి మరియు శేఖర్‌ కమ్ముల, దిల్‌రాజులకు వెళ్లి పోతుంది. ప్రేక్షకులు అంతా కూడా సాయి పల్లవి తెంగాణ అమ్మాయిగా మంచి నటనను కనబర్చి మెప్పించింది. భానుమతి పిల్ల కోసం అయినా సినిమా చూడాలంటున్నారు. ఇక ఓవర్సీస్‌ ప్రేక్షకులు శేఖర్‌ కమ్ముల చాలా కూల్‌గా, క్లాస్‌గా సినిమాను తెరకెక్కించాడు అంటున్నారు. ఇక సినీ వర్గాల వారు దిల్‌రాజు ఒక మంచి కథను ఎంపిక చేసుకుని, ఆ కథను నమ్మి సినిమా చేశాడు అంటున్నారు. ఇందులో వరుణ్‌ తేజ్‌ను మాత్రం ఏ ఒక్కరు ప్రస్థావించడం లేదు. అందుకే వరుణ్‌ తేజ్‌ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

‘పైసా వసూల్‌’ టీజర్‌పై వర్మ స్పందన