ధనుష్‌ సాహసోపేత నిర్ణయం

Danush Wants to remake Flop Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడు ముందు ఉంటాడు. కమర్షియల్‌గా కాకుండా ఎప్పుడు విభిన్న చిత్రాలను తీయడానికి ధనుష్‌ ఇష్టపడుతుంటాడు. అదే సమయంలో కమర్షియల్‌ సినిమాలను కూడా ధనుష్‌ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా ధనుష్‌కు బాలీవుడ్‌లో 2012లో తెరకెక్కి ప్లాప్‌ అయిన ఒక సినిమాపై మనస్సు మరలినట్లుగా తెలుస్తోంది. రణబీర్‌ కపూర్‌, ఇలియాన జంటగా తెరకెక్కిన ‘బర్ఫీ’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయాలని ఈయన కోరుకుంటున్నాడు. 

త్వరలో ధనుష్‌ నటించిన ‘వీఐపీ 2’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ధనుష్‌ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్‌ మూవీ ‘బర్ఫీ’ అంటే తనకు చాలా ఇష్టం అని, ఆ సినిమాలో రణబీర్‌ కపూర్‌ పోషించిన పాత్ర తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో రణబీర్‌ కపూర్‌ చెవిటి, మూగ వ్యక్తిగా కనిపించాడు. ఆ వ్యక్తి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే విషయమై ఆ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాను వచ్చే సంవత్సరం ధనుష్‌ రీమేక్‌ చేస్తాను అంటూ ప్రకటించాడు. ఒక ఫ్లాప్‌ సినిమాను రీమేక్‌ చేయాలనుకోవడం అంటే మామూలు నిర్ణయం కాదు. ధనుష్‌ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా నటుడిగా ధనుష్‌ స్థాయిని మాత్రం పెంచడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

‘పైసా వసూల్‌’ టీజర్‌పై వర్మ స్పందన

గౌతమ్ నంద… తెలుగు బులెట్ రివ్యూ.

రవితేజకు అరెస్ట్‌ భయం