రవితేజకు అరెస్ట్‌ భయం

Raviteja attends to SIT interrogation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రవితేజ నేడు డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరు అయిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు పలువురు సినీ సెలబ్రెటీలు విచారణ ఎదుర్కొన్నారు. అంతా కూడా సాఫీగా వెళ్లి సిట్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వచ్చారు. అయితే రవితేజ మాత్రం కాస్త ఆందోళనలో ఉన్నాడు. కారణం రవితేజకు డ్రగ్స్‌ ఇచ్చినట్లుగా కెల్విన్‌ గ్రూప్‌లోని పలువురు నిర్మొహమాటంగా చెప్పేశారు. దాంతో పాటు రవితేజ తమ్ముడు గతంలో పలు సార్లు డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా అరెస్ట్‌ అయ్యాడు. రవితేజకు కూడా డ్రగ్స్‌ వ్యాపారంలో భాగస్వామ్యం ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విచారణలో సిట్‌ అధికారులు రవితేజ డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా నిర్థారించుకోవడంతో పాటు, డ్రగ్స్‌ సరఫరా మరియు అమ్మకం గురించి రవితేజ హస్తం ఉందని తేలితే వెంటనే ఆయన్ను అరెస్ట్‌ చేస్తారనే చర్చ జరుగుతుంది. మరో వైపు రవితేజ లాయర్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం కూడా ధరకాస్తు చేశాడు అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి రవితేజ డ్రగ్స్‌ కేసులో మిగిలిన వారి కంటే కాస్త ఎక్కువగానే కూరుకు పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక డ్రగ్స్‌ పరీక్షకు రవితేజ శాంపిల్స్‌ ఇస్తాడా లేదా అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ రవితేజ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తే సిట్‌ అధికారులు ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం రవితేజ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ రెండు సినిమాల భవిష్యత్తు గందరగోళంలోకి నెట్టడం జరిగింది. అయితే రవితేజ తల్లి మాత్రం తన కొడుకుకు ఏ పాపం తెలియదని, అతడు నిర్దోషిగా వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

పైసా వసూల్ స్టంపర్ అదిరిందిగా… వీడియో

గౌతమ్ నంద… తెలుగు బులెట్ రివ్యూ.

స్టార్‌ మాను నెం.1 చేసిన బిగ్‌బాస్‌