స్టార్‌ మాను నెం.1 చేసిన బిగ్‌బాస్‌

Bigg Boss Telugu Gets Record TRP Rating because of NTR Bigg Boss

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్‌ మాటీవీలో ప్రసార్‌ అవుతున్న బిగ్‌బాస్‌ షోపై ఓ రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఏడుపు, గొడవలు సిల్లీ విషయాల చర్చలు అంటూ సోషల్‌ మీడియాలో తెలుగు బిగ్‌బాస్‌ గురించి అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. మరే సెలబ్రెటీలు లేనట్లుగా ఈ 14 మందిని ఎపింక చేయడం ఏంటి అని అంతా విమర్శించారు. కాని ఆ బిగ్‌బాస్‌ షో ఇప్పుడు మాటీవీని చాలా నెలల తర్వాత నెం. స్థానంకు తీసుకు వెళ్లింది. బిగ్‌బాస్‌ షో ప్రసారం అవుతున్నప్పటి నుండి రేటింగ్‌ అమాంతం పెరిగింది. ప్రతి వారం టీవీ ఛానెల్స్‌ రేటింగ్‌ విడుదల చేయడం జరుగుతుంది. ఈ వారం విడుదలైన రేటింగ్‌లో మాటీవీ దూసుకు పోయింది.

మొదటి స్థానంలో చాలా కాలంగా కొనసాగుతు వస్తున్న జెమినిటీవీని పక్కకు నెట్టి మాటీవీ భారీ రేటింగ్‌తో ముందుకు దూసుకు వచ్చింది. గత వారం 567 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్న మాటీవీ ఈవారం 168 పాయింట్లను పెంచుకుని 735కు చేరింది. బిగ్‌బాస్‌ షో కారణంగా జబర్దస్త్‌ మరియు ఇతర షోల రేటింగ్‌ తగ్గింది. దాంతో ఈటీవీ 15 పాయింట్లు తగ్గింది. జెమిని మాత్రం రానా షోతో 90 పాయింట్లు పెంచుకి 667 పాయింట్లను సంపాదించుకుంది. ఇదే ఊపు కొనసాగితే స్టార్‌ మాటీవీని ఇతర ఏ ఛానెల్స్‌ అందుకోలేవు అని విశ్లేషకులు చెబుతున్నారు. వీక్‌ డేస్‌లో ఎలా ఉన్నా వారాంతాల్లో అంటే శని, ఆది వారంలో ఎన్టీఆర్‌ వస్తున్న కారణంగా భారీగా రేటింగ్‌ వస్తుందని కొందరు అంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌పై విమర్శలు చేస్తూనే ప్రేక్షకులు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.

మరిన్ని వార్తలు

సంపూకు బిగ్‌బాస్‌ 50 లక్షల జరిమానా!

డ్రగ్స్‌ ఇష్యూ : ఛార్మిలో వర్మకు ఆ యాంగిల్‌ కనిపించిందట

గౌతమ్ నంద …తెలుగు బులెట్ ప్రివ్యూ.