సంపూకు బిగ్‌బాస్‌ 50 లక్షల జరిమానా!

50 Lakhs Fine For Sampoornesh Babu For Living Big Boss Show.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్‌బాస్‌ షో నుండి అర్థాంతరంగా వెళ్లినందుకు గాను సంపూకు పెద్ద చిక్కులు తప్పేలా లేవు. షోను ఒప్పుకునే ముందు సంపూర్నేష్‌బాబు స్టార్‌ మాటీవీ వారి అగ్రిమెంట్‌పై సంతకం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్‌ అయ్యేంత వరకు కూడా ఇంటి నియమాలను పాటిస్తూ ఇంట్లోనే ఉంటాను, ఒక వేళ నేను బయటకు వస్తే నాపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటూ అగ్రిమెంట్‌ రాసిచ్చిన సంపూర్నేష్‌బాబు ఆత్మహత్య యత్నం చేసి మరీ ఇంటి నుండి బయట పడ్డాడు. దాంతో ఇప్పుడు స్టార్‌ మాటీవీ యాజమాన్యం ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉంది.

బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ అది కూడా రెండవ వారంలోనే ఇలా జరగడంతో నిర్వాహకులు అగ్గిమీద గుగ్గిలం అన్నట్లుగా ఉడికి పోతున్నారు. అందుకు కఠినంగా వ్యవహరించాలని కూడా వారు భావిస్తున్నారు. మరొకరు ఇలా చేయకుండా సంపూర్నేష్‌బాబుపై లీగల్‌ చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు. అదే సమయంలో ఆయన నుండి 50 లక్షల జరిమానా కూడా వసూళ్లు చేసే విషయమై ఆలోచిస్తున్నారు. గతంలో హిందీ బిగ్‌బాస్‌ షో నుండి వెళ్లి పోయిన ముగ్గురు పార్టిసిపెంట్స్‌ ఏకంగా 50 లక్షల చొప్పున చెల్లించారు. అంటే ఇప్పుడు సంపూర్నేష్‌బాబు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి రావచ్చని సినీ వర్గాల వారు అంటున్నారు. సంపూర్నేష్‌బాబు ఆర్థికంగా ఆస్థాయిలో లేడు. కనుక ఖచ్చితంగా సంపూ లీగల్‌గా వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కూడా సంపూకు కష్టాలు తప్పవు. మొత్తానికి సంపూర్నేష్‌బాబు పెద్ద కష్టంలో పడ్డాడు.

డ్రగ్స్‌ ఇష్యూ : ఛార్మిలో వర్మకు ఆ యాంగిల్‌ కనిపించిందట