బిగ్‌బాస్‌లో ఆసక్తికర సంఘటన

Prince Elimination Very Sad In Bigg Boss Telugu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షో వారం వారం మరింత ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ఈ షో నుండి 9 మంది ఎలిమినేట్‌ అవ్వగా, తాజాగా నిన్న ప్రిన్స్‌ ఎలిమినేషన్‌ అయినట్లుగా ఎన్టీఆర్‌ ప్రకటించాడు. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో ప్రిన్స్‌ ఖచ్చితంగా విజయం సాధిస్తాడని లేదా రెండవ లేదా మూడవ స్థానంలో ప్రిన్స్‌ ఉంటాడని ఆయన అభిమానులు భావించారు. కాని ప్రిన్స్‌కు ప్రేక్షకులు షాక్‌ ఇచ్చారు. ఎలిమినేషన్‌కు ముందు రెండు రోజుల క్రితం తాను బిగ్‌బాస్‌ నెం.1 స్థానంలో ఉంటాను అంటూ ప్రిన్స్‌ తనకు తానుగా ప్రకటించుకున్నాడు. 

నెం.1 స్థానంలో ఉంటాను అని చెప్పుకున్న రెండు రోజుల్లోనే ప్రిన్స్‌ ఎలిమినేట్‌ అవ్వడం కాస్త విచారకరం. గత వారం ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన హరితేజ, అర్చనలను శనివారం సేఫ్‌ జోన్‌లోకి ఎన్టీఆర్‌ పంపించాడు. ఇక ఆదివారం నాడు ప్రిన్స్‌, నవదీప్‌, ఆదర్ష్‌లలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్కువ శాతం ప్రేక్షకులు ఆదర్ష్‌ ఎలిమినేట్‌ అవుతాడని భావించారు. కాని ప్రిన్స్‌కు తక్కువ ఓట్లు రావడంతో బిగ్‌బాస్‌ ఇంటి నుండి ఆదర్ష్‌ను పంపిస్తున్నట్లుగా ఎన్టీఆర్‌ ప్రకటించాడు. ప్రిన్స్‌ను ఇంటి సభ్యులు అంతా కూడా చాలా బాధతో పంపించేశారు. ఇప్పుడు ఇంట్లో ఇక మిగిలింది కేవలం ఆరుగురు మాత్రమే. వారిలోంచి శివబాలాజీ లేదా హరితేజలు బిగ్‌బాస్‌ సీజన్‌ 1ను గెలుపొందే అవకాశం ఉందని ఎక్కువ శాతం ప్రేక్షకులు భావిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు:

40 ఏళ్లు వ‌చ్చిన త‌రువాతే రిటైర్మెంట్

అర్జున ర‌ణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌