ధన్‌రాజ్‌ కారణంగా ముమైత్‌ ఔట్‌

Mumaith Khan Eliminated In Bigg Boss Telugu Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎంతో ఆసక్తిగా సాగుతున్న స్టార్‌ మాటీవీ ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 1లో నిన్న ఆదివారం ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఎలిమినేట్‌కు నామినేషన్‌ అయిన వారు కెప్టెన్‌ అయితే, ఎలిమినేషన్‌ను తప్పించుకోవచ్చు అని ఇన్ని రోజులు ఇంటి సభ్యులు భావించారు. కాని షాకింగ్‌గా కెప్టెన్‌ అయిన రెండు రోజుల్లోనే ముమైత్‌ ఖాన్‌ ఇంటికి వచ్చేసింది.

ఇప్పటికే రెండు సార్ల బయటకు వచ్చి, లోపలకు వెళ్లిన ముమైత్‌ ఖాన్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యింది. ముమైత్‌ ఖాన్‌ అంతకు ముందు వారంలో ఎలిమినేషన్‌ అయ్యి, కొన్ని కారణాల వల్ల రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. రీ ఎంట్రీ ఏ రేంజ్‌లో జరిగిందో ధన్‌రాజ్‌ను అడిగితే తొస్తుంది. పూర్తిగా ధన్‌ రాజ్‌ను టార్గెట్‌ చేసి, అతడిని వారం అంతా కూడా ఏడిపించి, వెళ్లి పోయే రేంజ్‌కు తీసుకు వచ్చింది. ధన్‌రాజు పట్ల ముమైత్‌ ఖాన్‌ వ్యవహరించిన తీరుపై ప్రేక్షకుల్లో ఆగ్రహం వ్యక్తం అయ్యింది.

ముమైత్‌ ఖాన్‌ మరీ దారుణంగా ధన్‌రాజ్‌ను ఏడిపించిందని, ఆమె మానవత్వం లేకుండా ప్రవర్తించింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. అందుకే ఎలిమినేషన్‌లో ఉన్న ముమైత్‌కు చాలా స్వల్ప పరిమాణంలో ఓట్లు పడ్డాయి. ఎక్కువ ఓట్లు రాకపోవడంతో ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. ధన్‌రాజ్‌ విషయంలో అతి చేయక పోతే ముమైత్‌ ఖాన్‌ ఖచ్చితంగా మరో రెండు మూడు వారాలు ఉండేది అని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ముమైత్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ జర్నీ ఎండ్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు:

వరుణ్‌ను నిజంగానే లవ్‌ చేస్తుందట

బాలయ్య 103కు ఫిక్స్‌ అయ్యాడు