మెగా ఫ్యాన్స్‌లో గందరగోళం

sai dharam tej and varun tej multistarrer movie in Teja direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా ఫ్యాన్స్‌ మెగా మల్టీస్టారర్‌ సినిమాల కోసం మొహం వాచి ఉన్నారు. మెగా హీరోలు కలిసి నటిస్తే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుగా ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ల కలయికలో ‘ఎవడు’ చిత్రం వచ్చింది. ఆ సినిమా పూర్తి స్థాయి మల్టీస్టారర్‌ కాకున్నా కూడా ఫ్యాన్స్‌ బాగా ఆధరించారు. ఇక పూర్తి స్థాయి మెగా మల్టీస్టారర్‌ చిత్రం కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మద్య సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు కలిసి నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు మెగా ఫ్యాన్స్‌కు చాలా సంతోషాన్ని కలిగించాయి. కాని తాము నటించడం లేదు అంటూ మెగా హీరోలు చెప్పడంతో ఫ్యాన్స్‌ ఉసూరుమన్నారు.

తాజాగా మెగా మల్టీస్టారర్‌ గురించి మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతుంది. వారం రోజుల క్రితం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దాగుడు మూతలు’ అనే మల్టీస్టారర్‌ చిత్రంలో మెగా హీరోలైన సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లు నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాకుండానే తాజాగా మరో వార్త అది కూడా మల్టీస్టారర్‌ వార్త సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ దర్శకుడు తేజ దర్శకత్వంలో మెగా హీరోలు సాయి ధరమ్‌ తేజ్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు కలిసి నటించబోతున్నారని, వీరిద్దరిని ఒక మంచి కథలో తేజ చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ రెండు మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఏది నిజం అనే విషయం తెలియక మెగా ఫ్యాన్స్‌ గందరగోళంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు:

వరుణ్‌ను నిజంగానే లవ్‌ చేస్తుందట

బాలయ్య 103కు ఫిక్స్‌ అయ్యాడు

ఏవేవో క‌ల‌లు క‌న్నా…ఏ వైపో క‌దులుతున్నా…