బాహుబ‌లి త‌ర్వాత భ‌ర‌త్ అను నేను

Bharath ane nenu movie bollywood rights bagged big amount

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హేశ్ బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న భ‌ర‌త్ అను నేనుపై ఇటు టాలీవుడ్ లోనూ, అటు ప్రేక్ష‌కుల్లోనూ భారీ అంచ‌నాలున్నాయి. వాటికి త‌గ్గ‌ట్టే ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. భ‌ర‌త్ అను నేను హిందీ రైట్స్ 13 కోట్లకు అమ్ముడైన‌ట్టు టాలీవుడ్ టాక్. బాహుబ‌లి త‌ర్వాత ఈ స్థాయి రేటు ప‌లికిన చిత్రం ఇదే. అటు ఓవ‌ర్సీస్ రైట్స్ కు కూడా భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. 18 నుంచి 20 కోట్ల‌కు ఓవ‌ర్సీస్ రైట్లు ద‌క్కించుకోటానికి రెండు భారీ సంస్థ‌లు పోటీప‌డుతున్నాయ‌ని, రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

శ్రీమంతుడు త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌టంతో చిత్రం ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర నుంచి భారీ హైప్ ఏర్ప‌డింది. శ్రీమంతుడు మ్యాజిక్ మ‌ళ్లీ రిపీట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ నమ్మ‌కంగా ఉంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా లోనే సందేశాన్ని చొప్పించటం ద్వారా కొర‌టాల టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇప్పుడు భ‌ర‌త్ అను నేను కూడా అదే త‌ర‌హాలో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో పాటు సందేశాత్మ‌కంగానూ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ మ‌హేశ్ బాబు స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

మెగా ఫ్యాన్స్‌లో గందరగోళం

ధన్‌రాజ్‌ కారణంగా ముమైత్‌ ఔట్‌

ఏవేవో క‌ల‌లు క‌న్నా…ఏ వైపో క‌దులుతున్నా…