వరుణ్‌ను నిజంగానే లవ్‌ చేస్తుందట

sai pallavi loves varun tej

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఫిదా’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులందరిని కూడా మంత్రముగ్దులను చేసింది. మొదటి సినిమాతోనే ఈ స్థాయి గుర్తింపు రావడంతో సాయిపల్లవి ఇప్పుడ తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా సాయి పల్లవితో నటించాలని కోరుకుంటున్నారు. కాని ఆమె మాత్రం ఇప్పటికే దిల్‌రాజు బ్యానర్‌లో రెండు సినిమాలు చేసేందుకు కమిట్‌మెంట్‌ ఇచ్చింది. ఇక మరోసారి వరుణ్‌ తేజ్‌తో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

‘ఫిదా’ ఆడియో వేడుకను దిల్‌రాజు అండ్‌ టీం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సాయి పల్లవి మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌ సభ్యులందరు కూడా షూటింగ్‌ సమయంలో నాతో చాలా బాగా వ్యవహరించారు. నన్ను బాగా చూసుకుని, నాకు ఉన్న ఇబ్బందులను గుర్తించి, వాటికి తగ్గట్లుగా చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. హీరో వరుణ్‌ తేజ్‌ గారు నాకు చాలా బాగా నచ్చాడు. ఆయన్ను సినిమా షూటింగ్‌ అయిపోయిన తర్వాత కూడా ప్రేమిస్తూనే ఉన్నాను. ఆయన చాలా కూల్‌ పర్సన్‌, ఎలాంటి హంగామా లేకుండా ఉంటాడు, ఆయన అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ఆ మాటలను ఏ ఉద్దేశ్యంతో అన్నదో కాని, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సాయి పల్లవి వరుణ్‌ తేజ్‌తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

ఏవేవో క‌ల‌లు క‌న్నా…ఏ వైపో క‌దులుతున్నా…

అర్జున్ రెడ్డి తర్వాత షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ

‘సైరా నరసింహారెడ్డి’లో కంచె…!