దీక్షకు లక్కీ ఛాన్స్‌

Diksha Panth Captain In Jr NTR Telugu Bigg Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు బిగ్‌బాస్‌ షో విశేష ప్రేక్షకాధరణ దక్కించుకుంటూ దూసుకు పోతుంది. భారీ రేటింగ్‌ను దక్కించుకుంటున్న ఈ షో క్లైమాక్స్‌కు చేరింది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో మరో 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 20 రోజుల్లో ఎవరు ఇంట్లో మిగులుతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం కెప్టెన్‌గా ముమైత్‌ ఖాన్‌ ఎంపికైనప్పటికి ఆమె ఎలిమినేట్‌ అయ్యింది ఆ కారణంగా కొత్త కెప్టెన్‌గా దీక్షా పంథ్‌ను ఎంపిక చేయడం జరిగింది. ముమైత్‌ ఖాన్‌ వెళ్లి పోయే ముందు ఇద్దరి పేర్లను చిటీల రూపంలో తీసి వెళ్లి పోయింది.

నిన్నటి ఎపిసోడ్‌లో నవదీప్‌ మరియు దీక్షల మద్య కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. ఎవరికి ఎక్కువ మంది మద్దతు ఉంటే వారు కెప్టెన్‌ అవ్వాలని బిగ్‌బాస్‌ సూచించాడు. దీక్షకు ముగ్గురు నవదీప్‌కు ఇద్దరు ఇంటి సభ్యులు మద్దతు పలికారు. దాంతో దీక్షాకు బిగ్‌బాస్‌ ఇంటి కెప్టెన్సీ దక్కింది. కెప్టెన్సీ దక్కిన కారణంగా దీక్షాకు నిన్న జరిగిన ఎలిమినేషన్‌ నామినేషన్‌ నుండి తప్పించడం జరిగింది. ఉన్న ఏడుగురు సభ్యుల్లో అయిదుగురు సభ్యులు నామినేషన్‌ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన వారిలో నవదీప్‌, ప్రిన్స్‌, హరితేజ, అర్చన, ఆదర్శ్‌లు ఉన్నారు. ఈ అయిదుగురులో ఒక్కరు లేదా ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

మహేష్‌, ఇలియానా కాంబో… క్లారిటీ వచ్చింది

బాలయ్యను ఇప్పటికీ బాధపెడుతున్న సినిమా