చైతూకు రాఖీ కడతానన్న సమంత!

Samantha frights Naga Chaitanya to tie Rakhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌, కాబోయే భార్య భర్తలు అయిన నాగచైతన్య, సమంతల ప్రేమ గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా నాగచైతన్య నటించిన ‘యుద్దం శరణం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. జీవితంలో మీరు ఎప్పుడైనా యుద్దం చేశారా అంటూ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు తన తల్లితో మరియు సమంతతో చిన్న పాటి యుద్దాలు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

చెన్నై నుండి స్కూల్‌ కోసం హైదరాబాద్‌ వచ్చేందుకు అమ్మతో యుద్దం చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రేమ విషయంలో సమంతతో కూడా యుద్దం చేశాను. ఇంట్లో ప్రేమ విషయాన్ని చెప్పాలంటూ సమంత పదే పదే ఒత్తిడి చేసేది. ఇక చివరికి ఇంట్లో ప్రేమ విషయాన్ని చెప్పకుంటే నేను నీ చేతికి రాఖి కట్టేస్తాను అంటూ బెదిరించిందట. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే ఇంట్లో వారికి తమ ప్రేమ విషయాన్ని చెప్పాను అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్‌లో వైభవంగా జరుగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. వీరిద్దరి ప్రేమపై తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబర్చుతున్నారు. ఇద్దరికి ఈడు జోడు చాలా బాగుంటుందని అంతా అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి శాటిలైట్‌ కష్టాలు

పవన్‌ మళ్లీ తండ్రి కాబోతున్నాడు!

పవన్‌25 టైటిల్‌ ఎప్పుడంటే..