పవన్‌25 టైటిల్‌ ఎప్పుడంటే..

Pawan Kalyan pspk 25 movie title on dasara

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు కానుకగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని త్రివిక్రమ్‌ ఫస్ట్‌లుక్‌ అయితే విడుదల చేశాడు కాని, అందులో టైటిల్‌ను మాత్రం ప్రకటించలేదు. విభిన్నంగా టైటిల్స్‌ను పెట్టడంలో సిద్ద హస్తుడు అయిన త్రివిక్రమ్‌ ఈ సినిమా కోసం చాలా ఆలోచిస్తున్నాడు. కథకు సంబంధించి, తన మార్క్‌తో టైటిల్‌ ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఎన్నో టైటిల్స్‌ను పరిశీలిస్తున్నాడు. ఆ క్రమంలోనే లేట్‌ అవుతుంది. ఎట్టకేలకు పవన్‌ సినిమా టైటిల్‌ ఎప్పుడు వచ్చే విషయమై క్లారిటీ వచ్చింది.

ఈ నెలలోనే దసరా కానుకగా పవన్‌ కళ్యాణ్‌ 25వ సినిమా టైటిల్‌ను త్రివిక్రమ్‌ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవలే విడుదలైన పవన్‌ సర్‌ప్రైజ్‌ వీడియోలో సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక సినిమా టీజర్‌ను దసరాకు విడుదల చేసి, మెగా ఫ్యాన్స్‌కు కానుక ఇవ్వాలని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా జరుగుతుంది. పవన్‌ కెరీర్‌లోనే రికార్డు స్థాయిలో 200 కోట్లను ఈ సినిమా వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

చరణ్‌ ముందే రానున్నాడు..!

ఎన్టీఆర్‌కు అదుర్స్‌.. తేజూకు ఇది

బిగ్‌బాస్‌ ఇంటికి అక్కినేని హీరో