చరణ్‌ ముందే రానున్నాడు..!

ram-charan-teja-rangasthalam-1985-movie-release-on-december

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే తాజాగా పవన్‌ కళ్యాణ్‌ తన 25వ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదల కానున్నాయని మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. రామ్‌ చరణ్‌ అండ్‌ టీంతో మాట్లాడిన తర్వాతే పవన్‌ 25వ సినిమా డేట్‌ ఫిక్స్‌ చేశారని, డిసెంబర్‌లోనే ‘రంగస్థలం’ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. 

డిసెంబర్‌లో ‘రంగస్థలం’ విడుదల కానున్న నేపథ్యంలో సంక్రాంతికి పవన్‌ 25వ సినిమాను విడుదల చేయాలని త్రివిక్రమ్‌ ఫిక్స్‌ అయ్యాడు. గత సంవత్సరం ‘ధృవ’ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా కూడా మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం కోసం చరణ్‌ ముందే వచ్చాడు. ఇప్పుడు బాబాయి సినిమా కోసం కూడా చరణ్‌ ముందే రావాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రంగస్థలం చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటిస్తుంది. ఒక పల్లెటూరి వ్యక్తిగా రామ్‌ చరణ్‌ కనిపించబోతున్నాడు.

మరిన్ని వార్తలు:

బాహుబ‌లి త‌ర్వాత భ‌ర‌త్ అను నేను

మెగా ఫ్యాన్స్‌లో గందరగోళం

ధన్‌రాజ్‌ కారణంగా ముమైత్‌ ఔట్‌