శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గా ఫ‌రూఖ్

chandrababu propose to TDP MLC Farooq as Legislative Council chairman

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గా ఎమ్మెల్సీ ఫ‌రూఖ్ ఎంపిక‌య్యారు. క‌ర్నూల్ జిల్లాకు చెందిన ఫ‌రూఖ్ పేరును చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌గానే… స‌హ‌చ‌ర స‌భ్యులంతా ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ హ‌ర్ష‌ధ్వానాలు చేశారు. మంగ‌ళ‌గిరి స‌మీపంలోని హ్యాపీరిసార్ట్స్ లో సెంట‌ర్ ఫ‌ర్ లీడ‌ర్ షిప్ ఎక్స్‌లెన్స్ పేరుతో ఓ స‌మావేశం ఏర్పాటు చేశారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. రెండు ప్రాంతాల్లో టీడీపీకి ద‌క్కిన విజ‌యాల‌ను అన్ని నియోజ‌క వ‌ర్గాల‌కు వ్యాపింప‌చేయ‌టానికి చంద్ర‌బాబు అధ్యక్ష‌త‌న ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటుచేశారు.

ఈ స‌మావేశంలోనే మండ‌లి చైర్మ‌న్ గా ఫ‌రూఖ్ పేరును చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. స‌మావేశంలో చంద్ర‌బాబు నంద్యాల‌, కాకినాడ ఫ‌లితాల‌పై సంతోషం వ్య‌క్తంచేశారు. గెలుపోట‌ములు ప‌నితీరుపై ఎప్పుడూ ప్ర‌భావం చూపిస్తాయ‌ని అన్నారు. సాంకేతిక‌ను అనుకూలంగా వాడుకుంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని బాబు చెప్పారు. ప్ర‌భుత్వ పాల‌న‌పై ఎక్కువ‌మంది ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తంచేస్తే ప్ర‌తిపక్షాల అస‌త్య ప్ర‌చారాలు ప‌నిచేయ‌వ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర‌కార్యాల‌యం అందుబాటులోకి వ‌స్తుంద‌ని, దాని వేదిక‌గా అంద‌రూ క‌లిసి ప‌నిచేద్దామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు:

బ్రిక్స్ స‌ద‌స్సులో పాకిస్థాన్‌, చైనాల‌కు ఎదురుదెబ్బ‌

వంగ‌వీటి గొడ‌వ‌పై వ‌ర్మ వివాదాస్ప‌ద కామెంట్లు

ఆ ఏడు రాష్ట్రాలు వద్దా మోడీ..?