ఆ ఏడు రాష్ట్రాలు వద్దా మోడీ..?

Narendra Modi Choose Overall The Seven States In Politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశమంతా ఆమోదం పొందాలంటే.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిథ్యం కావాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ముక్త భారత్ కోసం తపిస్తున్న మోడీ.. అన్ని రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. అలాంటిది నిన్నటి క్యాబినెట్ విస్తరణలో మాత్రం ఏడు రాష్ట్రాల్ని దూరం పెట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేవలం ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రుల్ని తీసుకున్నారనే వాదన పక్కకెళ్లి, అలాంటిది ఏఢు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా చేయడంపై కలవరం రేగుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ కీలకంగా భావిస్తున్న తెలంగాణ నుంచి ఉన్న ఏకైక మంత్రి దత్తాత్రేయను తప్పించి.

ఎవరికీ చోటివ్వకపోవడంపై సొంత పార్టీలోనూ అసంతృప్తి ఉంది. యూపీ, బీహార్ నుంచి ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ.. అందుకు తగ్గట్లే పన్నెండు, ఎనిమిది మందికి క్యాబినెట్ లో చోటు దక్కింది. కానీ తనకు సీట్లు ఇవ్వని రాష్ట్రాలను మోడీ చిన్నచూపు చూశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో మోడీ ఏం సాధిస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికలతో సంబంధం లేకుండా అందర్నీ సమదృష్టితో చూడాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు:

రూ. 200 నోటు కోసం మూడు నెల‌లు ఆగాల్సిందే

ఆగ‌ని ఉత్త‌ర‌కొరియా క‌వ్వింపు చర్య‌లు

అప్పుడు ఇందిర…ఇప్పుడు నిర్మ‌ల