రూ. 200 నోటు కోసం మూడు నెల‌లు ఆగాల్సిందే

We have to wait for 3months to get 200 notes
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్ర‌జ‌లంతా ఆతృత‌గా ఎదురుచూస్తున్న రూ.200 నోటు అందుబాటులోకి రావ‌టానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. రూ. 200 నోటు ఏటీఎంల‌లోకి రావ‌టానికి ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆర్బీఐ వెల్ల‌డించింది. నోట్లను ఏటీఎంల‌లో అమ‌ర్చాల్సిందిగా ప‌లు బ్యాంకులు ఏటీఎం నిర్వ‌హ‌ణ కంపెనీల‌ను ఆదేశించాయి. కానీ ఇప్ప‌టిదాకా ఆర్బీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేద‌ని కంపెనీలు  తెలిపాయి. ప్ర‌స్తుతం చ‌లామ‌ణిలో ఉన్న నోట్ల‌తో పోలిస్తే 200 నోట్లు ప‌రిమాణంలో చాలా చిన్న‌వి. వాటి సైజ్ కు త‌గ్గ‌ట్గుగా ఏటీఎంలలో మార్పులుచేయాల్సి ఉంద‌ని, దీనికి 90రోజులు స‌మ‌యం ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.ఏటీఎంలలో కొత్త‌గా చేసే ఈ మార్పులు వ‌ల్ల ఇత‌ర నోట్ల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని అంటున్నారు.
పెద్ద నోట్ల ర‌ద్దుత‌రువాత ఎదుర‌వుతున్న చిల్ల‌ర క‌ష్టాల‌ను తీర్చేందుకు రూ.200 నోటు తేవాల‌ని ఆర్బీఐ నిర్ణ‌యించింది. రూ.100 నోటుకు, రూ.500 నోటుకు మ‌ధ్య మ‌రో నోటు లేక‌పోవ‌ట‌తో రూ. 200 నోటుకు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా…ఆర్బీఐ పెద్ద సంఖ్య‌లో నోట్లు విడుద‌ల చేసింది. మ‌హాత్మాగాంధీ సిరీస్‌..ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ సంత‌కంతో ఈ కొత్త నోట్లు వ‌చ్చాయి. బంగారు వ‌ర్ణంలో ఉన్న రూ. 200నోటు వెన‌క‌వైపు భార‌తీయ సంప్ర‌దాయ వార‌సత్వానికి ప్ర‌తీకంగా సాంచి స్థూపం చిహ్నాన్ని ముద్రించారు.