తెలుగు నేర్చుకుంటున్న సాహో భామ‌

Shraddha Kapoor Learning Telugu Language For Sahoo Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహోలో హీరోయిన్ గా ఎంపిక‌యిన శ్ర‌ద్ధాక‌పూర్ ప్ర‌భాస్‌ను ఇప్ప‌టిదాకా ఒక్క‌సారి కూడా వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌లేదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమే తెలిపారు. సాహో అవ‌కాశం కంటే ముందుకానీ, ఆ త‌ర్వాత కానీ ప్ర‌భాస్ ను క‌లుసుకోలేద‌ని, ఫోన్ లో మాత్రం మాట్లాడుకున్నామ‌ని శ్ర‌ద్ధ తెలిపారు. ప్ర‌భాస్ ను ఆమె ఆలిండియా స్టార్ గా అభివ‌ర్ణించారు. ఆయ‌న్నుక‌లుసుకోటానికి ఆతృత‌గా ఎదురుచూస్తున్నాన‌ని తెలిపారు. సాహోలో పాత్ర కోసం తెలుగు నేర్చుకుంటున్నాన‌ని శ్ర‌ద్ధ చెప్పారు. ఈ క్ర‌మంలో ఆమె తెలుగు భాష‌కు సంబంధించి తాను తెలుసుకున్న ఓ విష‌యాన్ని వివ‌రించారు.

తెలుగులో నో ను ఎనిమిది ర‌కాలుగా చెప్పొచ్చ‌ని శ్ర‌ద్ధ తెలిపారు.ఇది త‌న‌కు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించింద‌న్నారు. సాహో త‌న‌కు తొలి బహుభాషా చిత్ర‌మ‌ని, ఈ క్యారెక్ట‌ర్ చేయ‌టం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పారు. ఒకే స‌న్నివేశాన్ని ఒకేసారి రెండు విభిన్న భాష‌ల్లో చేయ‌టం త‌న‌కు మంచి అనుభూతి మిగిలిస్తుంద‌నిసంతోషం వ్య‌క్తంచేశారు. యూవీ క్రియేష‌న్స్ 150 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్న సాహో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. బాహుబ‌లితో జాతీయ‌స్థాయిలో ఇమేజ్ పొందిన ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ క‌థానాయిక అయితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు సుజీత్ ఏరికోరి శ్ర‌ద్ధాక‌పూర్ ను ఎంపిక‌చేశారు. బాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరువ‌లో ఉన్న శ్ర‌ద్ధ సాహోతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ప‌వ‌న్ బాబాయ్ కావ‌టం అదృష్టం క‌న్నా ఎక్కువే

రెండో సినిమా హీరో శ‌ర్వానంద్…