రెండో సినిమా హీరో శ‌ర్వానంద్…

sandeep reddy next movie with Sharwanand fix

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తో సంచ‌ల‌నం సృష్టించాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి. సినిమాలో క‌థా నాయ‌కుడి పాత్రను మ‌లిచిన విధానంతో డైరెక్ట‌ర్ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచారు. చిన్న సినిమాగా సైలెంట్ గా వ‌చ్చి బాక్సాఫీసు వ‌ద్ద భారీ వ‌సూళ్లు సాధించ‌ట‌మే కాకుండా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. దీంతో సందీప్ రెడ్డితో సినిమాలు చేయ‌టానికి ఇప్పుడు హీరోలంతా పోటీప‌డుతున్నారు. యువ హీరోల్లో ఈ పోటీ ఎక్కువ‌గా ఉంది. సందీప్ రెడ్డి త‌ర్వాత సినిమా ఎవ‌రితో అన్న‌దానిపై చాలా రోజులుగా అనేక పేర్లు వినిపిస్తున్నా…చివ‌ర‌కు వైవిధ్య భ‌రిత క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ కు ఆ అవ‌కాశం ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి అర్జున్ రెడ్డి సినిమాను శ‌ర్వానందే చేయాల్సి ఉంది. కానీ ఈ క‌థ‌ను డైరెక్ట‌ర్ మొద‌ట ఆయ‌నకే వినిపించారు. శ‌ర్వానంద్ క‌థ విని చాలా ఎగ్జైట్ అయ్యారు కూడా. కానీ డేట్స్ ఎడ్జ‌స్ట్ కాక‌పోవ‌టంతో అర్జున్‌రెడ్డిలో న‌టించ‌లేక‌పోయారు. దీంతో త‌న రెండో సినిమాను శ‌ర్వానంద్ తోనే చేయాల‌ని సందీప్ రెడ్డి ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివ‌రాలు ఇంకా వెల్లడికాలేదు. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హానుభావుడులో న‌టిస్తున్నారు. ఈ సినిమా ద‌స‌రాకు విడుద‌ల‌కానుంది.

మరిన్ని వార్తలు:

కత్తి మహేష్‌పై వింత పుకార్లు.. క్లారిటీ

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బ‌ర్త్ డే కానుక

నిజంగానే బాలయ్య సెక్సీ