నిజంగానే బాలయ్య సెక్సీ

SS Rajmouli Tweets On Balayya Paisa Vasool Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి 2’ సినిమా విడుదల తర్వాత రాజమౌళి ఎక్కువగా పబ్లిక్‌తో గడుపుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా తన సినిమాకే అంకితం అయిన రాజమౌళి ఇప్పుడు ఇతర దర్శకులు తెరకెక్కించిన సినిమాలు చూస్తూ తన అభిప్రాయాలను వెళ్లడిస్తున్నాడు. ఇటీవలే ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను చూసి బాగుంది అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన రాజమౌళి తాజాగా విడుదలైన ‘పైసా వసూల్‌’పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సినిమా మొదటి ఆటనే చూసిన రాజమౌళి బాలయ్యపై మరియు పూరిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

బాలయ్య నిజంగా సెక్సీ అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో మారు మ్రోగిపోతున్నాయి.‘పైసా వసూల్‌’ గురించి రాజమౌళి రివ్యూ ఆయన మాటల్లో… హై ఎనర్జీతో బాలయ్యను పూరి మనకు చూపించారు. గత 100 సినిమాల్లో చూడని విధంగా బాలకృష్ణను ఈ చిత్రంలో పూరి జగన్నాధ్‌ చూపించినందుకు సంతోషంగా ఉంది. కొకొకోలా.. పెస్సీ… బాలయ్య బాబు సెక్సీ, ఇంతకు మించి ఇంకేం చెప్పగలం అన్నాడు. రాజమౌళి రివ్యూతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి మరింతగా పెరిగింది. సినిమా భారీ వసూళ్లను సాధించగలదని తేలిపోయింది. పూరి, బాలయ్యల కాంబోల వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయం అని మొదటి నుండి నిర్మాత నమ్మకంతో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే నమ్మకం నిజం అయ్యిందని నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు:

బ‌త‌కాలని లేదంటున్న గుర్మీత్

ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ