బ‌త‌కాలని లేదంటున్న గుర్మీత్

gurmeet ram rahim singh want to die

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క‌నుస‌న్న‌ల‌తో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి డేరా సామ్రాజ్యాన్నేలిన రాక్ స్టార్ బాబా గుర్మీత్ రామ్ ర‌హీత్ సింగ్ జైలులో నాలుగు గోడ‌ల మ‌ధ్య ఏం చేస్తున్నాడ‌న్న‌ది ఇప్పుడు అంద‌రిలో త‌లెత్తున్న సందేహం. దీనికి స‌మాధానం జైలు నుంచి విడుద‌ల‌యిన ఓ మాజీ ఖైదీ ద్వారా తెలిసింది. ఆయ‌న గుర్మీత్ ను ఉంచిన రోహ‌తక్ జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. జైలుకు వ‌చ్చిన తొలిరోజు గుర్మీత్ రాత్రంతా నిద్ర‌పోలేద‌ట‌. తాను చేసిన త‌ప్పేంట‌ని, ఈ శిక్ష త‌న‌కు ఎందుకు విధించారు దేవుడా…అని బాధ‌ప‌డిపోయాడ‌ట‌. త‌న‌కు బ‌త‌కాల‌ని లేద‌ని, త‌నను ఉరితీయాల‌ని కూడా గుర్మీత్ జైలు సిబ్బందిని వేడుకుంటున్నాడ‌ట‌.

ఇక జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌తో వీవీఐపీలా ఓ వెలుగు వెలిగిన గుర్మీత్ జైలులో మాత్రం సాధార‌ణ ఖైదీలానే ఉన్నాడ‌ట‌. బాబాను జైల్లోని మిగ‌తా ఖైదీల్లానే చూస్తున్నార‌ని, ఆయ‌నకు వీఐపీ ట్రీట్ మెంట్ ఏదీ లేద‌ని ఆ మాజీ ఖైదీ చెప్పాడు. ఇద్ద‌రు సాధ్విల‌పై అత్యాచారం కేసులో సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి గుర్మీత్ కు 20 ఏళ్ల జైలుశిక్ష ఖ‌రారు చేసిన రోజు కోర్టు హాల్లో ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్నాడు. త‌న‌ను ద‌య‌త‌ల్చాల‌ని న్యాయ‌మూర్తిని కోరాడు. కానీ జ‌డ్జి గుర్మీత్ అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌ట్టించుకోలేదు. శిక్ష ఖరార‌యిన రోజు గుర్మీత్ ఇలా ఆందోళ‌న‌గా ఉన్నాడు కానీ…దోషిగా నిర్ధారించే రోజు మాత్రం ఆయ‌న అంత‌గా ఆందోళ‌న చెంద‌లేదు. పంచ‌కుల కోర్టు త‌న‌ను దోషిగా నిర్ధారిస్తే…అనుచ‌రుల సాయంతో ఎలాగైనా త‌ప్పించుకోవాల‌ని ఆయ‌న కుట్ర ప‌న్నారు. కానీ గుర్మీత్ ప‌న్నాగాన్ని ప‌సిగ‌ట్టిన హ‌ర్యానా పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆయ‌న ప‌థ‌కం పార‌నివ్వ‌లేదు.

మరిన్ని వార్తలు:

ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ

చంద్ర‌బాబుపై చెద‌ర‌ని న‌మ్మ‌కం

మేయర్ పీఠం పై ఎవ‌రు?