ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ

Modi cabinet reshuffle on sunday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం దగ్గ‌ర‌ప‌డుతోంది. ఆదివారం ఉద‌యం ప్ర‌ధాని మోడీ మంత్రివ‌ర్గాన్ని విస్తరించ‌నున్నారు. పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా బీజేపీలోని కొంద‌రు నేత‌ల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోనున్నారు. కొంత‌మంది మంత్రుల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌నున్నారు. ఇందుకు వీలుగా ఇప్ప‌టికే కొంద‌రు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీవ్ ప్ర‌తాప్ రూఢీ, ఉమాభార‌తి, సంజీవ్ బ‌ల్యాన్ గురువార‌మే రాజీనామాలు స‌మ‌ర్పించ‌గా మ‌రికొంద‌రు… శ‌నివారం సాయంత్రంలోపు ప‌ద‌వుల నుంచి త‌ప్పుకునే అవ‌కాశ‌ముంది. కేంద్ర మంత్రి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన కొంద‌రికి పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అమిత్ షా భావిస్తున్నారు.

అటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ద‌త్తాత్రేయ కూడా మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పుకోనున్నారు. ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అధ్య‌క్షుడు అమిత్ షా ఈ మేర‌కు త‌న‌కు హామీ ఇచ్చార‌ని ద‌త్త‌న్న చెప్పారు. బీజేపీనేత‌ల‌తో పాటు కొత్త‌గా ఎన్డీఏలో చేరిన మిత్ర‌ప‌క్షాల‌కూ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లే ఎన్డీయేలో చేరిన జేడీయూతో పాటు బీజేపికి ద‌గ్గ‌ర‌గా మ‌సులుతున్న అన్నాడీఎంకె కు మంత్రిప‌ద‌వులు కేటాయించ‌నున్న‌ట్టు స‌మాచారం. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత ప్ర‌ధాని బ్రిక్స్ దేశాల స‌మావేశంలో పాల్గొనేందుకు చైనా వెళ్ల‌నున్నారు.

మరిన్ని వార్తలు:

పీకే,సాక్షి, కొమ్మినేనికి వైసీపీ నాయకురాలు షాక్.

మేయర్ పీఠం పై ఎవ‌రు?

చంద్ర‌బాబు స‌మ‌ర్థ‌త‌కు ద‌క్కిన విజ‌యం