డేరా బాబా చిన్నారుల్ని కూడా వదిలిపెట్టలేదు.

dera-baba-sexual-harassment-on-school-children

Posted September 13, 2017 at 13:25 

డేరా బాబా జైలుకి వెళ్ళాక ఆయన అకృత్యాలు ఒక్కోటిగా బయటికి వస్తున్నాయి. ఆయన వికృత కామ క్రీడకి ఎందరో మహిళలు బలైపోయారని ఇప్పటిదాకా తెలిసింది. అంతకు మించిన దారుణాలు అతను చేసినట్టు ఒకప్పుడు బాబా ఆశ్రమంలో పనిచేసిన గురుదాస్ సింగ్ ట్యూడ్ బయటపెట్టారు. డేరా ఆధ్వర్యంలో నడిచే విద్యాలయాల్లో చదివే స్కూల్ పిల్లలని సైతం బాబా లైంగికంగా వేధించిన విషయాన్ని విచారణలో పోలీసులకి వెల్లడించారు గురుదాస్. అప్పట్లో ఇలా గురుమీత్ అకృత్యాలకు చిన్నారులు సైతం బలైపోతున్న విషయం బయటికి చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.

గురుమీత్ లైంగిక వేధింపులకు బలైన వారిలో చాలా మంది ఆశ్రమం వదిలివెళ్ళి పెళ్లిళ్లు చేసుకుని జీవితాల్లో స్థిరపడిపోయారు. అందుకే వీరిలో చాలా మంది చేదు గతాన్ని తవ్వుకోడానికి ఇష్టపడడం లేదు. అయితే పెళ్లి అయ్యి అమెరికాలో స్థిరపడ్డ ఓ అమ్మాయి మాత్రం బాబా అక్రమాలు బయటపెట్టడానికి తానెంత ఇబ్బంది పడింది చెప్పుకొచ్చింది. స్కూల్ లో చదివేటప్పుడు బాబా తనని లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని ఇంటిలో చెప్తే తల్లిదండ్రులు వాటిని చిన్నపిల్లల మాటగా కొట్టిపడేశారని ఆమె వాపోయింది. ఈ విషయం గురించి ఎక్కువగా చెబితే తననే కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించినట్టు ఆమె చెప్పారు. బాబా అకృత్యాల గురించి చెప్పినా తన తల్లిదండ్రులు ఆయన్ని దేవుడుగా కొలవడంతో ఏమి చేయాలో అర్ధం కాలేదని బాధితురాలు కన్నీళ్ల పర్యంతం అయ్యింది. తాను పెళ్లి అయ్యి అమెరికాలో స్థిరపడ్డాక కూడా మూఢభక్తి పనికిరాదని తల్లిదండ్రులకి చెప్పినా వినలేదని ఆమె వివరించారు. డేరా బాబా భక్తుల మానసిక స్థితి ఇలా ఉంటే ఇక వారి పిల్లలు అక్కడి స్కూల్ లో చదువుకుంటూ ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారో వేరే చెప్పనవసరం లేదు.

మరిన్ని వార్తలు:

ఉత్త‌రకొరియా వ‌స్త్ర ఎగుమ‌తుల‌పై నిషేధం… ఐక్య‌రాజ్య‌స‌మితి క‌ఠిన ఆంక్ష‌లు

ప‌వ‌న్ ఫాలోవ‌ర్లు రెండు మిలియ‌న్లు

శ‌శిక‌ళ‌ది ఇక గ‌త వైభ‌వ‌మే…

SHARE