సాహోలో డ్యూయ‌ల్ రోల్ కాదు

shraddha kapoor comments on saaho movie double role

Posted September 13, 2017 at 13:25 

సాహో సినిమాలో త‌న‌ది డ్యూయ‌ల్ రోల్ అంటూ సాగుతున్న ప్ర‌చారం నిజం కాదంటోంది హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్. త‌న‌ది సాహోలో ఒక‌టే రోల్ అని ఆమె స్ప‌ష్టంచేసింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ రావ‌టాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటోంది శ్ర‌ద్ధ‌. ఈ సినిమాలో త‌న పాత్ర‌పై పూర్తి సంతృప్తితో ఉన్నాన‌ని, బ‌హుభాషా చిత్రంలో అవ‌కాశంరావ‌టం గొప్ప విష‌యమ‌ని శ్ర‌ద్ధ తెలిపింది. కొద్దిరోజుల క్రిత‌మే శ్ర‌ద్ధ సాహో షూటింగ్ లో జాయిన్ అయింది. షూటింగ్ లోనే తెలుగు నేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని శ్ర‌ద్ధ తెలిపింది.

శ్ర‌ద్ధ‌కు సాహోనే తొలి తెలుగు సినిమా. ప్ర‌భాస్ కు ఇది తొలి హిందీ సినిమా. ఆయ‌న బాహుబ‌లి హిందీలో రిలీజ‌యినా..అది డ‌బ్బింగ్ సినిమాగా విడుద‌ల‌యింది. ప్ర‌భాస్ పాత్ర‌కు వేరొక‌రు డ‌బ్బింగ్ చెప్పారు. హిందీలో తొలిసారి డైరెక్ట్ గా న‌టిస్తున్న ప్ర‌భాస్ సాహోకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాల‌ని భావిస్తున్నారు. హిందీ నేర్చుకునేందుకు ప్ర‌త్యేక ట్యూట‌ర్ ను కూడా పెట్టుకున్నారు. శ్ర‌ద్ధ కూడా తెలుగు నేర్చుకోవ‌టం కోసం ప్ర‌త్యేక శిక్ష‌కుణ్ని నియ‌మించుకుంది. అయితే ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధ‌లిద్ద‌రూ షూటింగ్ స‌మ‌యంలో హిందీ, తెలుగు నేర్చుకునేందుకు ఒక‌రికొక‌రు సాయం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

బిగ్‌బాస్‌ సీజన్‌కే ఈ ఎపిసోడ్‌ హైలైట్‌

బాలయ్య దెబ్బలు…ఎన్టీఆర్ కి ముద్దులు.

మేఘ ఆకాష్‌ ప్రేమలో నితిన్‌?

SHARE