మేఘ ఆకాష్‌ ప్రేమలో నితిన్‌?

young-hero-nithinnext-film-heroine-conformed-as-megha-akash

Posted September 13, 2017 at 10:16 

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్‌ను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సక్సెస్‌ కాంబినేషన్‌ను కంటిన్యూ చేయడం, ఫ్లాప్‌ అయితే ఆ కాంబినేషన్‌కు మళ్లీ ప్రయత్నించక పోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే నితిన్‌ మాత్రం తనకు భారీ డిజాస్టర్‌గా నిలిచిన ‘లై’ చిత్ర హీరోయిన్‌ను మళ్లీ మళ్లీ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో నితిన్‌ నటించబోతున్న ఒక సినిమాలో మేఘ ఆకాష్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. ‘లై’ సినిమా సక్సెస్‌ కాకపోవడంతో ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అనుకోని అవకాశం మాదిరిగా నితిన్‌తోనే ఈ అమ్మడికి మరోసారి ఛాన్స్‌ దక్కింది. 

‘లై’ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా హీరోయిన్‌ అద్బుతంగా నటించింది అన్న పేరు మేఘ ఆకాష్‌కు వచ్చింది లేదు. ఆమె నటన ఆ సినిమాలో సో సోగానే ఉంది. అయినా కూడా నితిన్‌కు ఆమెతో ఏర్పడిన బంధమో లేక స్నేహమో ఏమో కాని మళ్లీ ఆమెనే కావాలని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు ఆ సినిమా నిర్మాత కూడా ఇటీవలే మేఘ ఆకాష్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్‌, త్రివిక్రమ్‌లు నిర్మిస్తున్న సినిమాలో నితిన్‌ నటిస్తున్నాడు. ఆ తర్వాత ఒక కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఆ కొత్త సినిమాలో మరోసారి మేఘ ఆకాష్‌తో రొమాన్స్‌ చేయబోతున్నాడు. మరి ఈసారి అయినా మేఘ ఆకాష్‌కు నితిన్‌ బ్రేక్‌ ఇచ్చి, టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబెడతాడేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

ప‌వ‌న్ ఫాలోవ‌ర్లు రెండు మిలియ‌న్లు

మహానుభావుడుకి సాహో సపోర్ట్‌

కో…కో…కోటివ్యూస్‌

SHARE