బాలయ్య దెబ్బలు… ఎన్టీఆర్ కి ముద్దులు.

ntrs-fan-hugs-him-at-jai-lava-kusa-pre-release-event

Posted September 13, 2017 at 11:05 

అన్న ఎన్టీఆర్ మొదలుకుని ఇంకా చిత్ర రంగ ప్రవేశం కూడా చేయని మోక్షజ్ఞ దాకా నందమూరి హీరోల్ని నెత్తిన పెట్టుకుని చూసే అభిమానుల గురించి ఎంత చేప్పినా తక్కువ అవుతుంది. నందమూరి ఫాన్స్ తాజాగా జైలవకుశ ఫీవర్ లో మునిగి తేలుతున్నారు. అయినా ఆ సినిమాతో పాటు ఇంకో విషయం కూడా వారి మధ్య బాగా నలుగుతోంది. అదే ఫాన్స్ విషయంలో బాలయ్య, ఎన్టీఆర్ వ్యవహరించే తీరు తెన్నులు గురించి. దగ్గరికి వచ్చే అభిమానుల విషయంలో బాలయ్య దురుసుగా వ్యవహరిస్తారని ఇప్పటికే ఓ ఇమేజ్ పడిపోయింది. ఆయన అభిమానుల మీద చేయి చేసుకోవడం గురించి సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వార్తలు హల్ చెల్ చేశాయి. మరీ ముఖ్యంగా జాతీయ మీడియా కూడా అడపాదడపా బాలయ్య ఫాన్స్ మీద దురుసుగా ఉండటాన్ని తప్పుబడుతూ కధనాలు ఇస్తోంది. అలా బాలయ్య దెబ్బల విషయం విస్తృతంగా ప్రచారం అవుతుండడం ఫాన్స్ కి ఇబ్బందిగానే మారింది.

ఊహించని ఘటన

నందమూరి ఫాన్స్ కి కాస్త ఊరట కలిగించే అంశం ఇంతలో ఒకటి జరిగింది. జైలవకుశ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఓ అభిమాని రక్షణ వలయాన్ని ఛేదించుకుని మరీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతన్ని లాగేయడానికి బౌన్సర్లు వస్తుంటే ఎన్టీఆర్ వారిని నిలువరించి ఆ అభిమానిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. హగ్ తో తనివితీరని ఆ కుర్రోడు ఏకంగా ఎన్టీఆర్ బుగ్గ మీద ముద్దు పెట్టేసాడు. అయినా ఎన్టీఆర్ అతన్ని ఏమీ అనలేదు. ఆహ్వానం ఇచ్చినంత సాదరంగా అతనికి వీడ్కోలు పలికాడు. ఈ ఎపిసోడ్ నందమూరి ఫాన్స్ కి గర్వంగా అనిపించింది. అయితే బాలయ్య బిహేవియర్ ని ఎత్తి చూపడానికి ఎన్టీఆర్ ఈ విధంగా వ్యవహరించాడనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయినా ప్రతి విషయంలో ప్రతికూల అంశాన్ని మాత్రమే చూడగలిగిన వాళ్లకి ఏమి చెప్పినా,ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. అది వాళ్ళ కర్మ అని వదిలేయాల్సిందే.

ముద్దు పెట్టిన ఫ్యాన్

మరిన్ని వార్తలు:

ప‌వ‌న్ ఫాలోవ‌ర్లు రెండు మిలియ‌న్లు

మహానుభావుడుకి సాహో సపోర్ట్‌

కో…కో…కోటివ్యూస్‌

SHARE