సేఫ్‌ గేమ్‌ ఆడుతున్న ‘జైలవకుశ’

jr-ntr-jai-lava-kusa-movie-in-a-safe-zone

Posted September 13, 2017 at 13:09

ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రలు పోషించిన ‘జై లవకుశ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 21న దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలకు సిద్దం అవుతుంది. నేడో రేపో సెన్సార్‌ బోర్డు ముందుకు ఈ సినిమాను తీసుకు వెళ్లేందుకు నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ సిద్దం అయ్యాడు. ఇక సెన్సార్‌ బోర్డు ముందుకు తీసుకు వెళ్లేందుకు 155 నిమిషాల నిడివితో ఫైనల్‌ ఎడిట్‌ వర్షన్‌ సినిమాను సిద్దం చేశారు. మొదట సినిమాను పావుతక్కువ రెండు గంటలు ఉంచాలని భావించారు.

ఇటీవల ఎక్కువ సినిమాలు లెంగ్త్‌ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్లాప్‌ అయిన ఘటనలు ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్‌ అండ్‌ టీం సేఫ్‌ గేమ్‌ ఆడాలని నిర్ణయించుకున్నారు. అందుకే రెండున్నర గంటల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ 155 నిమిషాల నుండి సెన్సార్‌ కట్స్‌ తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు తగ్గే అవకాశం కూడా ఉందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్లింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను కళ్యాణ్‌ రామ్‌ నిర్మించాడు. మొదటి సారి ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపించడంతో పాటు, మొదటి సారి రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లతో రొమాన్స్‌ చేశాడు. సినిమా టీజర్‌లు మరియు ట్రైలర్‌లు చూస్తుంటే సినిమా రచ్చ రచ్చగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు:

వివేగం ఒక ఫ్లాప్‌ మూవీ

బిగ్‌బాస్‌ సీజన్‌కే ఈ ఎపిసోడ్‌ హైలైట్‌

SHARE