తండ్రి కుమార్తెను ముట్టుకోకూడ‌దా…?

Posted October 3, 2017 at 15:29 

honeypreet-singh-clarifies-about-gurmeet-baba-her-relationship

ఇద్ద‌రు సాధ్విల‌పై అత్యాచారం కేసులో డేరా బాబా దోషిగా నిర్దార‌ణ అయిన ద‌గ్గ‌ర‌నుంచి త‌ప్పించుకు తిరుగుతున్న ఆయ‌న దత్త‌పుత్రిక‌గా చెప్పుకునే హ‌నీప్రీత్ సింగ్… తొలిసారి మీడియాతో మాట్లాడింది. గుర్మీత్ కు, త‌న‌కు ఉన్న అనుబంధం గురించి మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అబద్ధ‌మే అని హ‌నీప్రీత్ వ్యాఖ్యానించింది. ఓ తండ్రి త‌న కుమార్తెను ప్రేమ‌గా ముట్టుకోకూడ‌దా అని ఆమె ప్ర‌శ్నించింది. త‌మ అనుబంధం విష‌యంలో మీడియా అస‌త్య క‌థ‌నాలు ఎందుకు ప్ర‌సారం చేస్తోందో అర్ధం కావ‌డం లేదని, ఇది త‌నను చాలా బాధిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది. సినిమా స్టార్ అయ్యేందుకు గుర్మీత్ కు శిష్యురాలిగా మారానంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అస‌త్య‌మ‌ని, కెమెరా ముందు ఉండాల‌ని తానేనాడూ కోరుకోలేద‌ని హర్మీత్ క‌న్నీరు పెట్టుకుంది. గుర్మీత్ దోషిగా నిర్ధార‌ణ అయిన త‌రువాత జ‌రిగిన అల్ల‌ర్ల వెన‌క త‌న హ‌స్తం ఉంద‌న్న వార్త‌లనూ ఆమె ఖండించింది. న్యాయ‌స్థానం ఎదుట లొంగిపోతాన‌ని, హ‌ర్యానా, పంజాబ్ న్యాయ‌స్థానాల‌పై త‌న‌కు న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపింది. 37

SHARE