కత్తి మహేష్‌పై వింత పుకార్లు.. క్లారిటీ

Kathi Mahesh clarity about on his suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ను ఫ్యాన్స్‌ ఏకి పారేస్తున్నారు. తీవ్ర స్థాయిలో కత్తి మహేష్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో మరియు ఫోన్‌లో దుమ్మెత్తి పోస్తున్నారు. నిమిషానికి 10 మంది పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు కత్తి మహేష్‌కు కాల్‌ చేసి బెదిరిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతగా బెదిరింపులకు పవన్‌ ఫ్యాన్స్‌ పాల్పడుతున్న నేపథ్యంలో కత్తి మహేష్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ నిర్ణయం మరేంటో కాదు ఆత్మహత్య. అవును కత్తి మహేష్‌ ఆత్మహత్య యత్నం చేశాడని కొన్ని మీడియా ఛానెల్స్‌ ప్రచారం చేయడంతో కత్తి మహేష్‌ రియాక్ట్‌ అయ్యాడు.

కత్తి మహేష్‌ ఆత్మహత్య యత్నం, స్నేహితులు కాపాడటం వంటివి మీడియాలో వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించాడు. ‘నేను ఆత్మహత్యకు ప్రయత్నించడం ఏమిటి స్వామీ.. బిందాస్‌గా బతుకుతుంటేను!’ అంటూ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌తో గత రెండు రోజులుగా కత్తి మహేష్‌ ఆత్మహత్య యత్నం అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం జరిగింది. పవన్‌ ఫ్యాన్స్‌ మరో వైపు కత్తి మహేష్‌ను వాయిస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో కత్తి మహేష్‌పై బూతుల వర్షం కురుస్తుంది. నీస్థాయి ఏంటి, నువ్వు ఎవ్వడు పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించేంత స్థాయి నీకు ఉందా అంటూ బండ బూతులు తిడుతున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డిని ఇంకా పెంచుతారట!

నిజంగానే బాలయ్య సెక్సీ

చిరు చిన్నల్లుడు సినిమాల్లోకి..!