సింగ‌పూర్ అధ్య‌క్షుడిగా భార‌త సంత‌తి వ్య‌క్తి…

JY Pillay appointed as new singapore president

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సింగ‌పూర్ తాత్కాలిక అధ్యక్షుడిగా భార‌త సంత‌తి వ్య‌క్తి ఎన్నిక‌య్యారు. 84 ఏళ్ల సామాజిక వేత్త జే వై పిళ్లై తాత్కాలిక అధ్య‌క్షుడిగా కొంత‌కాలం ప‌నిచేయ‌నున్నారు. ఈ నెల 23న అధ్యక్ష‌ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అవి పూర్త‌యి కొత్త అధ్య‌క్షుడు బాధ్య‌త‌లు స్వీక‌రించే వ‌ర‌కు జే వై పిళ్లై ఆ ప‌ద‌విలో ఉంటారు. అధ్య‌క్షుడిగా ఆరు సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న టోనీ టాన్ కెంగ్ య‌మ్ నుంచి పిళ్లై బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

1991 త‌ర్వాత సింగ‌పూర్ అధ్యక్ష స్థానానికి ఖాళీ ఏర్ప‌డ‌టం ఇదే తొలిసారి. అయితే పిళ్లై తాత్కాలిక అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌టం ఇదే తొలిసారికాదు. 2007లో అప్ప‌టి అధ్యక్షుడు ఎస్ ఆర్ నాథ‌న్ ఆఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు పిళ్లై దాదాపు 16 రోజుల పాటు అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. దాంతో పాటు గ‌త మే నెల‌లో టాన్ యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు కూడా అధ్య‌క్షుడి స్థానాన్ని పిళ్లైనే భ‌ర్తీచేశారు. 84 ఏళ్ల పిళ్లై కౌన్సిల్ ఆఫ్ ప్రెసిడెన్షియ‌ల్ అడ్వైజ‌ర్స్ కు చైర్మ‌న్ గా ఉన్నారు. ఈ నెల 23న జ‌రిగే ఎన్నిక‌ల్లో గెలిచిన అభ్య‌ర్థి పిళ్లై నుంచి దేశాధ్య‌క్షుడిగా బాధ్య‌తలు స్వీక‌రిస్తారు. ఈ ఎన్నిక‌ల కోసం మ‌లై సంత‌తికి చెందిన ముగ్గురు బ‌రిలో నిల‌వ‌నున్నారు.

మరిన్ని వార్తలు:

బ‌త‌కాలని లేదంటున్న గుర్మీత్

చంద్ర‌బాబుపై చెద‌ర‌ని న‌మ్మ‌కం

మేయర్ పీఠం పై ఎవ‌రు?