డేరా చించేస్తున్న ప్రముఖ సంస్థలు

Popular People Defends Dera Baba

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ మనిషి దిగజారాడని తెలిసిన మరుక్షణం సమాజం ఎంతగా స్పందిస్తుందో.. డేరా బాబా విషయంలో ప్రూవ్ అవుతోంది. డేరా బాబాను రేప్ కేసులో అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి ఆయనకు ఒకటొకటిగా షాకులు తగులుతున్నాయి. విమానాశ్రయ ప్రత్యేక అనుమతి జాబితాలో డేరా బాబా ఇప్పటివరకూ 51వ స్థానంలో ఉండి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సౌకర్యం లేకుండా పోయింది.

దేశంలోని ప్రముఖులకు, ముఖ్యమైన వ్యక్తులకు ఎయిర్ పోర్టు లాంజుల్లో ప్రత్యేక ప్రవేశం కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక జాబితా నుంచి డేరా బాబు పేరు తీసేశారు. భవిష్యత్తులో ఎయిర్ పోర్టుకు వెళ్తే సాధారణ ప్రయాణికుడిలాగే క్యూల నిల్చుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ వార్త తెలిసి జైల్లో ఉన్న డేరా బాబా తెగ బాథపడిపోతున్నాడట.

సినిమాలంటే పడి చచ్చిపోయే డేరా బాబాకు ఆ రంగం నుంచీ షాక్ తగిలింది. ఇండియన్ ఫిల్మ్ టెలివిజన్ డైరక్టర్స్ అసోసియేషన్ నుంచి ఆయన మెంబర్ షిప్ రద్దైంది. పైగా ఫ్యూచర్లో ఆయనతో ఎవరూ సినిమాలు తీయకూడదని అసోసియేషన్ తీర్మానించింది. దేశంలో సకల మర్యాదలు అనుభవించిన డేరా బాబా ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని.. రేపిస్టు బాబాగా బతుకుతున్నాడు.