ముద్రగడకు తత్వం బోధపడింది

Mudragada To Know About the truth

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాపుల్లో పేరు లేని ముద్రగడ రిజర్వేషన్ల అంశంతో బతికేద్దామనుకున్నారు. ఇంకోసారి పార్టీలన్నింటినీ బెదిరించి రాజకీయ చరమాంకంలో ఓ వెలుగు వెలగాలని ఆశపడ్డారు. గతంలోనే రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన ముద్రగడ.. వెంటనే ప్రభుత్వంతో రాజీపడి.. కాపుల్లో అపనమ్మకం కలిగించారు. పైగా ఓ రోజు సీఎంను తిట్టి.. మరో రోజు పొగడటంతో కాపులందరికీ అనుమానాలు వచ్చాయి.

గతంలో దాసరి నేతృత్వంలో కాపు ప్రముఖులంతా ముద్రగడకు మద్దతు ప్రకటించినా ఏమీ కాలేదు. అలాంటిది ఈసారి ఒంటరిగా బరిలోకి దిగి ఏం సాధించారో ముద్రగడకు బాగా అర్థమైంది. ఓవైపు ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నా.. ముద్రగడ మొండి పట్టుదలకు పోవడం, కనీసం పాదయాత్రకు పర్మిషన్ తీసుకోకపోవడంపై కాపుల్లో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

కాకినాడ కార్పొరేషన్ ఫలితాలతో కాపులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోయింది. పైగా చంద్రబాబుపై అనుకున్నంత వ్యతిరేకత లేకపోవడం ముద్రగడకు మింగుడు పడటం లేదు. తాను చెప్పిన మాటల కంటే.. ముద్రగడ వైసీపీతో ఉన్నారన్న టీడీపీ వ్యాఖ్యలపై ఓటర్లపై ప్రభావం చూపాయని ముద్రగడ గ్రహించారు. అందుకే సార్వత్రిక ఎన్నికల వరకు సైలంట్ గా ఉండి.. ఆ తర్వాత జగన్ తో మళ్లీ టచ్ లోకి వెళ్లాలనుకుంటున్నారు. కానీ ముద్రగడ బలం తెలుసుకున్న జగన్.. ఆయన్ను రానిస్తారా అనేది సందేహమే.