హార్దిక్ పాండ్యాకు నెటిజ‌న్ల స‌ల‌హాలు

hardik pandya tweet on parineeti chopra twitter post

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సెల‌బ్రిటీలు ఏ విష‌యంపైనైనా ఓ కామెంట్ చేస్తే చాలు… దానిపై నెటిజ‌న్లు వెంట‌నే రియాక్ట‌వుతుంటారు. సెల‌బ్రిటీల పోస్ట్ ల‌పై త‌మ‌కు తోచిన కామెంట్లు పెడుతుంటారు. అయితే కొన్నిసార్లు నెటిజ‌న్ల కామెంట్లు పాజిటివ్ గా కాకుండా…విమ‌ర్శించే ధోర‌ణిలోనే సాగుతుంటాయి. అది సెల‌బ్రిటీల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందే ప‌డుతున్నాడు క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా.

విష‌య‌మేంటంటే బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా తాజాగా ట్విట్ట‌ర్ లో ఓ సైకిల్ ఫొటో పోస్ట్ చేసింది. ఓ అద్భుత‌మైన పార్ట‌న‌ర్ తో ప‌ర్ ఫెక్ట్ ట్రిప్ . ల‌వ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అని ఆ ఫొటోకు క్యాప్ష‌న్ ట్వీట్ చేసింది. ప‌రిణీతి చేసిన పోస్టుపై హార్ధిక్ పాండ్యా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. ఆ పార్ట‌న‌ర్ ఎవ‌రో నేను ఊహించ‌నా…నాకు తెలిసి మ‌రో బాలీవుడ్, క్రికెట్ లింక్ అనుకుంటా అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కు స్పందిస్తూ ప‌రిణీతి నీ ఊహ త‌ప్పు, నీకు కావాల్సిన క్లూ ఫొటోలోనే ఉంది…అని స‌మాధాన‌మిచ్చి…త‌న సైకిలే త‌న పార్ట‌న‌ర్ అంటూ స‌ర‌ద‌గా ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది.

ఇక్క‌డిదాకా అంతా బాగానే ఉంది. హార్దిక పాండ్యా పెట్టిన కామెంటుకు ప‌రిణీతి ఎక్క‌డా కోపం తెచ్చుకోలేదు. న‌వ్వుతూనే త‌న స‌మాధానం పోస్ట్ చేసింది. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన ఈ సంభాష‌ణ ఎక్క‌డా ప‌రిధులు దాట‌లేదు. అయినా స‌రే ప‌రిణీతి చోప్రా పోస్ట్ కు హార్ధిక్ పాండ్యా స్పందించ‌టం విచిత్రంగా నెటిజ‌న్ల‌కు కోపం తెప్పించింది. హార్దిక్ పాండ్యా అమ్మాయిపై కాకుండా ఆట‌పై శ్ర‌ద్ద పెట్టాలి అంటూ నెటిజ‌న్లు తెగ స‌ల‌హాలిస్తున్నారు. స‌ర‌దాగా త‌ను చేసిన కామెంట్ పై ఇలాంటి రియాక్ష‌న్ రావ‌టం హార్దిక్ పాండ్య‌ను ఇబ్బందుల్లో ప‌డేసింది.

మరిన్ని వార్తలు:

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం

షమీ కూతురితో డాన్స్ చేస్తున్న కోహ్లి… వైరల్ వీడియో

మళ్ళీ జట్టులోకి వచ్చిన డాషింగ్ ఓపెనర్….