ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం

bangladesh wins 1st test match against australia

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌పంచ టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో పెనుసంచ‌ల‌నం న‌మోద‌యింది. ప‌సికూన జ‌ట్టు, క్రికెట్ దిగ్గ‌జంపై విజ‌య‌భేరి మోగించింది. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 20 ప‌రుగుల తేడాతో నెగ్గి  చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ లోని షేర్ బంగ్లా నేష‌న‌ల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రిగింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 260 ప‌రుగులు చేయ‌గా ఆస్ట్రేలియా 217 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.  బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో  221 ప‌రుగులు చేసింది. 265 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాను ష‌కీబ్ అల్ హ‌స‌న్ త‌న అద్భుత బౌలింగ్ తో దెబ్బ‌తీశాడు. రెండో  ఇన్నింగ్స్ లో హ‌స‌న్ ఒక్క‌డే 5 వికెట్లుతీశాడు. తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు, హ‌స‌న్ మిరాజ్‌రెండు వికెట్లు తీయ‌డంతో ఆస్ట్రేలియా 244 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ఓపెన‌ర్ వార్న‌ర్ 112 ప‌రుగులు చేసినా ఫ‌లితం లేక‌పోయింది. మిగ‌తా ఆట‌గాళ్లు ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌టంతో జ‌ట్టు ఓట‌మి పాల‌యింది. అనిశ్చితికి మారుపేర‌యిన వ‌న్డేల్లో చిన్న జ‌ట్లు పెద్ద జ‌ట్ల‌పై గెల‌వ‌డం అప్పుడ‌ప్పుడూ జ‌రిగేదే. ఒక్క బ్యాట్స్‌మెన్నో, ఒక బౌల‌రో అద్భుత రీతిలో రాణిస్తే వ‌న్డేలు, టీ 20ల్లో విజ‌యం సాధించ‌వ‌చ్చు.  కానీ ఆట‌గాళ్లంద‌రూ నిల‌క‌డ‌గా రాణించితే త‌ప్ప టెస్ట్ మ్యాచుల్లో గెలుపు సాధ్యం కాదు. అందుకే పెద్ద జ‌ట్ల‌పై చిన్న జ‌ట్లు టెస్ట్ మ్యాచ్ ల్లో గెలవ‌టం అత్యంత అరుదుగా జ‌రుగుతుంటుంది. బంగ్లాదేశ్ ఇప్పుడా ఘ‌న‌త సాధించింది.

మరిన్ని వార్తలు:

అర్జున ర‌ణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

షమీ కూతురితో డాన్స్ చేస్తున్న కోహ్లి… వైరల్ వీడియో

టీ 10 క్రికెట్లోకి సెహ్వాగ్