రికార్డు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ “జవాన్” సినిమా

రికార్డు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ “జవాన్” సినిమా
Latest News

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన జవాన్ మూవీ అంచనాలకు మించి థియేటర్ లలో ప్రదర్శితం అవుతూ కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ లు సాధించిన మూవీ గా అవతరించింది. ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగానే కలెక్షన్ లను సాధించి వెయ్యి కోట్లకు దగ్గరగా వెళ్లబోతోంది . తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా లోని జవాన్ మూవీ 4 మిలియన్ లు మార్కును దాటిందట. కానీ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మూడు ఇండియన్ మూవీ లు మాత్రమే ఈ ఘనతను సాధించాయట. ఈ మూడు మూవీ లలో రెండు మూవీ లు షారుఖ్ ఖాన్ ఖాతాలో ఉండడం విశేషం.. అందులో ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన పఠాన్ సినిమా కాగా .. దానికి ముందు ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమా . మంచి ఘనత సాధించడం విశేషం.

రికార్డు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్  “జవాన్” సినిమా
Shah Rukh Khan “Jawan Movie “

ఇంకా కొన్ని రోజులు మూవీ థియేటర్ లలో ఉండే అవకాశం ఉండడం తో కలెక్షన్ లు మరింతగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాగా ఈ మూవీ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు.