మహేష్‌, ఇలియానా కాంబో… క్లారిటీ వచ్చింది

Rumours on Mahesh Ileana act together with vamshi paidipally direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌ బ్యానర్‌లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. తాజాగా ‘స్పైడర్‌’ చిత్రాన్ని ముగించిన మహేష్‌బాబు, ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని చేయనున్నాడు. ఇప్పటికే కొంత షూటింగ్‌ను కూడా ‘భరత్‌ అను నేను’ చిత్రం ముగించుకుంది. డిసెంబర్‌లో కొరటాల శివ షూటింగ్‌ను పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో సిద్దం అయ్యాడు. ఇక ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు సినిమాను చేయనున్నాడు.

మహేష్‌బాబు కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి ముద్దుగుమ్మ ఇలియానాతో చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో సూపర్‌ హిట్‌ చిత్రాలను చేసిన ముద్దుగుమ్మ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన నటిస్తూ దూసుకు పోతుంది. బాలీవుడ్‌ నుండి ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌లో మహేష్‌బాబు సాయంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే మహేష్‌బాబు సినిమా కోసం తాము ఇలియానాను సంప్రదించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇంకా హీరోయిన్‌ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందని, త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఒక విభిన్న తరహా కథాంశంతో సినిమాను తెరకెక్కించబోతున్నారు.

మరిన్ని వార్తలు:

బాలయ్యను ఇప్పటికీ బాధపెడుతున్న సినిమా

బాలీవుడ్ అర్జున్ రెడ్డి ర‌న‌వీర్ సింగ్‌?

పవన్‌25 టైటిల్‌ ఎప్పుడంటే..