ఎక్కడున్నా తీరు మారని రెడ్డిగారు

JC Diwakar Reddy Controversial comments on AP Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆయన తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ పొలిటీషియన్. ముఖ్యమంత్రులతో కూడా జోకులు వేయగల అనుభవం ఉంది. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కుదిరితే జగన్ కు కూడా ఉచిత సలహాలు ఇవ్వగల స్టేచర్ ఉంది. కానీ ఎన్ని ఉన్నా నోరు మాత్రం అదుపులో ఉండటం లేదు. దీంతో ఆ సీనియర్ నేత తరచుగా అందరికీ టార్గెట్ అవుతున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు.

మొన్నటివరకు ఎయిర్ లైన్స్ ఎఫిసోడ్ తో దేశవ్యాప్తంగా పాపులరైన జేసీ.. ఇప్పుడు కులం గురించి మాట్లాడి చర్చకు తెరతీశారు. జగన్ కు కులపిచ్చి ఉందని తిడుతున్న జేసీ.. తనకూ కులపిచ్చి ఉందని గతంలో చెప్పుకున్నారు. పైగా సీఎంకు కూడా కులపిచ్చి అంటగట్టే విధంగా మాట్లాడుతున్నారు.

జేసీ వ్యాఖ్యల కారణంగా చాలాసార్లు చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని తమ్ముళ్లు బాథఫడుతున్నారు.జేసీ లాంటి వారికి పొలిటికల్ అండ ఇస్తే.. ఇప్పుడు అసలుకే ఎసరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. జేసీ లోపాయికారీగా జగన్ కు సహకరిస్తున్నారనే అనుమానం కూడా టీడీపీ నేతలకు ఉంది. కానీ చంద్రబాబు మాత్రం గుంభనంగా ఉన్నారు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలియడం లేదు.

మరిన్ని వార్తలు:

ఆగ‌ని ఉత్త‌ర‌కొరియా క‌వ్వింపు చర్య‌లు

అప్పుడు ఇందిర…ఇప్పుడు నిర్మ‌ల