బాలీవుడ్ అర్జున్ రెడ్డి ర‌న‌వీర్ సింగ్‌?

ranveer-singh-to-remake-vijay-deverakondas-arjun-reddy-in-bollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ తాజా సంచ‌ల‌నం అర్జున్‌రెడ్డి పై దక్షిణాది హీరోల‌దే కాదు…బాలీవుడ్ క‌న్నూ ప‌డింది. అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసే చాన్స్ క‌నిపిస్తోంది. రీమేక్ లో న‌టించ‌బోయేది ఎవ‌రో చిన్న స్థాయి హీరో కాదు. హిందీ సినిమాల్లో విశేష పాపులారిటీ ఉన్న ర‌ణవీర్ సింగ్. . తెలుగులో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ట్రెండ్ సెట్ట‌ర్ గా ఉన్న అర్జున్ రెడ్డి గురించి వింటున్న ర‌ణ‌వీర్ సింగ్ ఆ సినిమా ట్రైల‌ర్‌, టీజ‌ర్ చూశారు. అంతేకాదు…ఈ సినిమాపై వ‌స్తున్న వివాదాల గురించి కూడా తెలుసుకున్నారు.

అర్జున్ రెడ్డిపై ర‌ణ‌వీర్ చూపిస్తున్న ఆస‌క్తిని గ‌మ‌నించి బాలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్ సునీల్ నారంగ్ స్పెష‌ల్ స్క్రీనింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా చూసిన త‌రువాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో న‌టించ‌టానికి ర‌ణ్ వీర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వొచ్చ‌ని బాలీవుడ్ లో టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా త‌మిళ రీమేక్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ హీరో ధ‌నుష్ కు చెందిన నిర్మాణ సంస్థ ద‌క్కించుకుంది. చిన్న సినిమాగా వ‌చ్చి టాలీవుడ్ లో భారీ స‌క్సెస్ సాధించ‌టంతో అర్జున్ రెడ్డి పై అన్ని భాష‌ల్లోనూ ఆస‌క్తి పెరిగింది. తెలుగులో అర్జున్ రెడ్డి పాత్ర‌లో అంత‌గా పాపులారిటీ లేని విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించగా…ఇత‌ర భాష‌ల్లో మాత్రం పెద్ద హీరోలు ఈ సినిమా రీమేక్‌లో న‌టించేందుకు పోటీప‌డుతుండ‌టం విశేషం.

మరిన్ని వార్తలు:

బాహుబ‌లి త‌ర్వాత భ‌ర‌త్ అను నేను

మెగా ఫ్యాన్స్‌లో గందరగోళం

ధన్‌రాజ్‌ కారణంగా ముమైత్‌ ఔట్‌