బాలయ్యను ఇప్పటికీ బాధపెడుతున్న సినిమా

balakrishna-sensational-comments-on-okkamagadu-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏ హీరోకు అయినా కెరీర్‌లో ఒక చెత్త సినిమా ఉంటుంది. దాదాపు అందరు హీరోలు కూడా చెత్త సినిమాలు చేస్తారు. ఆ సినిమాలు ఎందుకు చేశామా అని స్టార్‌ హీరోలు కూడా బాధపడుతూ ఉంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తన జీవితంలో అత్యంత దారుణమైన సినిమా గురించి ప్రస్తావించాడు. వైవిఎస్‌ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్క మగాడు సినిమాను ఎందుకు చేశానా అని ఇప్పటికి కూడా బాధపడుతున్నా అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. 

బాలయ్య కెరీర్‌లో ఎన్నో డిజాస్టర్స్‌ ఉన్నాయి. కాని ఆ సినిమాలు బాలయ్య క్రేజ్‌కు తగ్గట్లుగా ఉన్నాయి. కాని ఒక్కమగాడు సినిమా మాత్రం ఏమాత్రం ఆయన స్థాయికి తగ్గట్లుగా ఉండదు. పైగా ఆ సినిమా కారణంగా నిర్మాత చౌదరి ఏకంగా 20 కోట్ల లాస్‌ను చవిచూడాల్సి వచ్చింది. బాలయ్య కెరీర్‌ అంత పెద్ద లాస్‌ సినిమా అంతకు ముందు లేదు, ఇప్పటికి రాలేదు. ఆ స్థాయి లాస్‌ రావడంతో నిర్మాత మళ్లీ కోలుకోలేక పోయాడు. ఆ కారణంగా కూడా బాలయ్య ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు:

బాహుబ‌లి త‌ర్వాత భ‌ర‌త్ అను నేను

మెగా ఫ్యాన్స్‌లో గందరగోళం

ధన్‌రాజ్‌ కారణంగా ముమైత్‌ ఔట్‌