వైసీపీలోకి అలీ…నిజమిదే ?

తెలుగులో కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి అభిమానుల మన్ననలు పొందాడు అలీ. సేథాకొకొఅ చిలుక సినిమాలో బాలనటుడిగా తెరంగేట్రం చేసి అనతి కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగిపోయాడు. తనదైన శైలితో పంచులు వేసి ప్రేక్షకులను నవ్వించే ఆయన ఇప్పటి వరకు వేయికి పైగా సినిమాల్లో కనిపించాడు. అలీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. ఇండస్ట్రీలో అందరితోనూ కలివిడిగా ఉండే ఈ కమెడియన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మాత్రం బాగా క్లోజ్‌గా ఉంటాడు. పవన్‌ కు కూడా అలీ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతీ సినిమాలో అలీ తప్పకుండా ఉంటాడు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం వల్ల అలీ కొద్దిరోజుల్లో జనసేనలో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా వార్తలు వెలువడ్డాయి. రాజమహేంద్రవరంలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి అలీ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని చాలా మంది అనుకున్నారు. అయితే, ఆ వార్తలకు క్లారిటీ అయితే రాలేదు కానీ, తాజాగా అలీ విషయంలో మరో ఆసక్తికర వార్త బయటికొచ్చింది.

వైసీపీలోకి అలీ...నిజమిదే ? - Telugu Bullet

జనసేన అధినేతకు అత్యంత సన్నిహితుడైన అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాడని జగన్ ప్రచార వాహనంలో వీరిద్దరూ ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలీ జగన్‌ను కలవడంతో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్‌పై వైసీపీ అధినేత వ్యక్తిగత దూషణకు దిగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అలీ-జగన్ కలయిక ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. వాస్తవానికి వైసీపీలో మైనారిటీలకు మంచి గుర్తింపు ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ కంటే ఆ పార్టీనే వాళ్లకు ఎక్కువ సీట్లు కేటాయించింది. ఈ కారణంగానే అలీ వైసీపీ అధినేతతో భేటీ అయ్యారనే వార్తలు హల్చల్ చేస్తుండగా. అసలు జరిగిన విషయం ఏంటంటే జగన్ నిన్న కేసుల విచారణ కోసం విశాక నుండి హైదరాబద్ ఫ్లైట్ లో వచ్చారు. ఈ సందర్భంలో ఎయిర్పోర్ట్ బస్ లో వీరిద్దరూ కలిసి ఉండగా బయటకు వచ్చిన ఫోటోలు ఇంత పని చేశాయి.