బాబు పై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు !

చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన కేసీఆర్ బాబు టార్గెట్‌గా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో విమర్శలు ఎక్కుబెట్టారు. చంద్రబాబు నాయుడిని దేశంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్‌గా అభివర్ణించిన కేసీఆర్ టీడీపీ నాయకులు జీర్ణించుకోలేని రీతిలో విరుచుకుపడ్డారు. నాలుగేళ్లపాటు బాబు మోదీ చంక నాకారని ఇప్పుడు రాహుల్ చంక నాకుతున్నారంటూ మండిపడ్డారు. బాబును భరిస్తోన్న ఏపీ ప్రజలకు చేతులెత్తి మొక్కాలన్న కేసీఆర్. ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ అడ్డుకుంటుందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఏపీకి పత్యేక హోదా ఇవ్వాలని కేశవరావు రాజ్యసభలో కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎంపీ కవిత, జితేందర్ రెడ్డి లోక్‌సభలో ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధానికి నేను లేఖ రాస్తానని కేసీఆర్ ప్రకటించారు.విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను ఇరు రాష్ట్రాలకు ఇస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.

చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని విమర్శించిన కేసీఆర్ ఫైన్సాన్స్ కమిషన్ సూచనల ప్రకారమే కేంద్రం నిధులు అందిస్తోందన్నారు. ప్రజాసంక్షేమం మీద దృష్టి లేక, అవినీతి వల్లే చంద్రబాబు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. హోదా వద్దని ఆయనే అంటాడు కావాలని ఆయనే అంటాడు, బాబు పచ్చి స్వార్థపరుడని కేసీఆర్ విమర్శించారు. నాలుగేళ్లు మోదీకి సపోర్ట్ చేసినప్పుడు నీ నీతి ఏమైందని ప్రశ్నించారు. మామ పెట్టిన పార్టీని లాక్కున్నాడని ఆయన నాయకుడి కాదని మేనేజర్‌ వంటూ కేసీఆర్ విమర్శించారు. ‘ఇద్దరు ఎంపీలతో నేను తెలంగాణ సాధించాను. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని నేను ఢిల్లీ వెళ్లాను. ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. 25 సీట్లు గెలిపిస్తే చక్రం తిప్పుతానని నీలాగా ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పింది భారత్ ఫెడరల్ ఫ్రంట్ గురించి. మొన్ననే ప్రముఖ శాస్త్రవేత్తలతో నాలుగు గంటలు మాట్లాడా, నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీసం అవగాహన లేదు. మీడియాని మేనేజ్ చేసి ఫ్రంట్ పేజీలో రాయించుకోవడం నీకు అలవాటు అంటూ ఒక రేంజ్ లో ఫైరయ్యారు.