‘ఆర్ఆర్ఆర్’ సినిమా తాజా అప్డేట్ !

RRR-Launch-Event

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయకులుగా దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే రాజమౌళి కుమారుడు పెళ్లి కోసం ఇప్పుడు అందరూ జైపూర్ వెళ్లారు. అయితే ఈ జనవరిలో రెండో షెడ్యూల్ ప్రారంభంకానుంది. మరోవైపు, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. రెండు భాగాలుగా సినిమా తీస్తే నిర్మాతలకు సేఫ్ ఉంటుందని భావిస్తున్నారట. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. అదేంటంటే విలన్ రోల్ ను రానా చేస్తున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున అందుకుంది. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో యష్ ను విలన్ గా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా మాత్రం ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఈ చిత్రంలో విలన్ ఎవరో ?అనే విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.