ఒకే ఒక్క సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ !

వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే వర్మ, తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి వెన్ను పోటు అనే సాంగ్‌ని విడుద‌ల చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ వెన్నుపోటు పాత వివాదం రేగగా తన మీద కేసులు వేసిన వాళ్ళ మీదే కేసులు వేసి షాకిచ్చాడు. ఆ తర్వాత సైలెంట్ అయి రీసెంట్‌గా చెర్రీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన విన‌య విధేయ రామ చిత్ర ట్రైల‌ర్‌ పై ప్ర‌శంసలు కురిపించాడు. అయితే తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన పేటా చిత్ర ట్రైల‌ర్‌ని వీక్షించిన వ‌ర్మ ర‌జ‌నీకాంత్‌ని ఆకాశానికి ఎత్తేశాడు. ఒకే ఒక్క సూపర్‌స్టార్ రజినీ అని ఆయన 20 ఏళ్లు చిన్నవాడిలా, 30 రెట్లు ఉత్సాహంగా కనిపిస్తున్నారు’ అంటూ ట్రైల‌ర్‌ ని షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు. త‌మ అభిమాన హీరోని వ‌ర్మ పొగిడేస‌రికి ర‌జ‌నీకాంత్ అభిమానులు ఆ ట్వీట్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘పేటా’ రూపొందుతోంది. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.