‘పైసా వసూల్‌’ టీజర్‌పై వర్మ స్పందన

RGV Tweets Balaiah New Movie Paisa Vasool Stumper

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏ విషయంలో స్పందించినా ఆ విషయానికి విపరీతమైన క్రేజ్‌ రావడం సర్వ సాదారణం. అలాగే ఈసారి వర్మ ఫేస్‌బుక్‌లో నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ చిత్రం టీజర్‌పై స్పందించాడు. బాలయ్య 101వ చిత్రం అయిన ఈ సినిమాకు సంబంధించిన స్టంపర్‌ తాజాగా విడుదలైంది. నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ స్టంపర్‌ వర్మను కూడా ఆకట్టుకుందట. ఆయన స్వయంగా ఫేస్‌బుక్‌లో ఈ సూపర్‌ అంటూ పోస్ట్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

సహజంగా అయితే వర్మ ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోడు. పూరితో వర్మకు ఉన్న సన్నిహిత్యం గురించి ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆ సన్నిహిత్యంతోనే వర్మ ‘పైసావసూల్‌’ స్టంపర్‌ విడుద అయిన వెంటనే స్పందించాడు. సూపర్‌ సూపర్‌ డూపర్‌ ఇలా బాలయ్యను చూడటం మొదటిసారి, ఇలా చూడటం చాలా బాగుంది అంటూ పోస్ట్‌ చేశాడు. వర్మ అభినందనలు పొందిన పైసా వసూల్‌ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియ నటిస్తుండగా, ఐటెం సాంగ్‌ను కైరా అద్వానీ చేసింది. సంక్రాంతి సందర్బంగా సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. ఇక సినిమాలోని ప్రతి డైలాగ్‌ను ప్రేక్షకులు ఫుల్‌ పుల్‌గా ఎంజాయ్‌ చేస్తారని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

రవితేజకు అరెస్ట్‌ భయం

పైసా వసూల్ స్టంపర్ అదిరిందిగా… వీడియో

గౌతమ్ నంద… తెలుగు బులెట్ రివ్యూ.